Chinese Woman Fired: మహిళకు షాక్.. ఆఫీసు టైమ్ కంటే నిమిషం ముందుగా ఇంటికెళ్లినందుకు..
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:24 PM
ఆఫీస్ టైమ్ కంటే ఒక నిమిషం ముందుగా వెళ్లినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న మహిళ న్యాయపోరాటం చేసి విజయం దక్కించుకుంది. ఈ ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: నిమిషం ఆలస్యమైన పరీక్ష హాలులోకి రాయనీమనే నిబంధన మనం చూస్తూనే ఉన్నాం. అయితే, దాదాపు ఇలాంటి నిబంధన కారణంగా చైనాలో ఓ యువతి ఉద్యోగం పోగొట్టుకుంది. ఆ తరువాత న్యాయపోరాటం చేసి గెలిచింది. పరిహారం కూడా పొందింది. గ్వాంగ్జూలో ప్రావిన్స్‌లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది (Chinese Woman Fired For Leaving Office A Minute Early).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, వాంగ్ అనే యువతి గత మూడేళ్లుగా ఓ సంస్థలో పనిచేస్తోంది. ఆమె పనితీరు బాగుందంటూ పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందింది. కానీ ఒకే ఒక పొరపాటు ఆమె ఉద్యోగం పోయేలా చేసింది. గతేడాది ఓసారి ఆమె ఓ నెలలో ఆరు రోజుల పాటు ఆఫీసు టైమ్ కంటే నిమిషం ముందుగానే ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి ఎప్పుడు బయలుదేరిందీ సీసీటీవీ కెమరాల్లో కూడా రికార్డు అయ్యింది. అయితే, యువతి మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు.
గత డిసెంబర్ నెలాఖరున అకస్మాత్తుగా ఆమెకు హెచ్‌ఆర్ నుంచి కబురు వచ్చింది. హెచ్‌ఆర్ ఆఫీసుకు వెళ్లగా అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఆ నెలలో ఆరు రోజుల పాటు ఆఫీసు సమయం కంటే నిమిషం ముందుగానే బయటకు వెళ్లిపోయినట్టు రికార్డైందని హెచ్ ఆర్ చెప్పారు. ఆమె క్రమశిక్షణా రాహిత్యానికి ఫలితంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, మహిళ షాకైపోయింది. కనీసం వార్నింగ్ అయినా ఇవ్వకుండా, తప్పు సరిదిద్దుకునే అవకాశం లేకుండా తనను తొలగించడం అన్యాయమని భావించింది. చివరకు కంపెనీ యాజమాన్యాన్ని కర్టుకు ఈడ్చింది.
న్యాయస్థానం కూడా యువతి వాదనతో ఏకీభవించింది. ఒక నిమిషం ముందుగా ఆఫీసు నుంచి వెళ్లడాన్ని తప్పుబట్టలేమని, అది పని ఎగ్గొట్టినట్టు కాదని స్పష్టం చేసింది. ఆమె కలిగిన కష్టానికి గాను పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే, పరిహారం ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.
ఇక చైనాలో వెలుగు చూసిన మరో ఘటన ఓ సంస్థ.. ఆఫీసులో చిన్న కునుకును తీసిన ఓ ఉద్యోగిని తొలగించి చేతులు కాల్చుకుంది. అప్పటికే అతడు సంస్థలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అంతకుముందు రోజు ఓవర్ టైం కూడా చేసున్నాడు. అలాంటి వ్యక్తిని అత్యంత అవమానకరంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు కంపెనీపై రూ.41.6 లక్షల జరిమానా విధించింది.
ఇవి కూడా చదవండి:
యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..