Share News

5 నెలలుగా తలనొప్పి.. సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:51 AM

Chopsticks In Nose And Brain: ఐదు నెలల నుంచి తలనొప్పి తగ్గకపోవటంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు సీటీ స్కాన్ చేశారు. అప్పుడు షాకింగ్ విషయం బయటపడింది. అతడి ముక్కు, మెదడులో చాప్‌స్టిక్స్ ఉన్నట్లు బయటపడింది. అవి ఎలా లోపలికి వెళ్లాయో ఆ వ్యక్తి మొదట చెప్పలేకపోయాడు. బాగా ఆలోచించటంతో అసలు సంగతి గుర్తుకు వచ్చింది.

5 నెలలుగా తలనొప్పి.. సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
Chopsticks In Nose And Brain

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలల జరిగే వింత విచిత్రమైన సంఘటనల్ని ఇంట్లో కూర్చుని తెలుసుకోగలుగుతున్నాం. కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నపుడు మనకు.. ‘ అలా ఎలారా?’ అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ కూడా అలాంటిదే.. తాజాగా, ఓ వ్యక్తి ఐదు నెలల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక ప్రతీ రోజూ నొప్పి మాత్ర వేసుకుంటూ ఉన్నాడు. ఎన్ని రోజులకు నొప్పి తగ్గకుండా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో సీటీ స్కాన్ తీయగా షాకింగ్ విషయం బయటపడింది. అతడి ముక్కు, మెదడులో చాప్‌స్టిక్స్ ఉన్నట్లు తేలింది. దీంతో డాక్టర్లు షాక్ అయ్యారు. ఆ చాప్‌స్టిక్స్ అతడి ముక్కు, మెదడులోకి ఎలా వెళ్లాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.


వియత్నాంకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తికి గత ఐదు నెలల నుంచి తీవ్రమైన తలనొప్పి వస్తోంది. నొప్పి మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. దానికి తోడు ముక్కునుంచి విపరీతంగా నీళ్లు కారుతూ ఉన్నాయి. కంటి చూపు కూడా బాగా మందగించింది. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతడికి సీటీ స్కాన్ చేశారు. సీటీ స్కాన్‌లో అతడి ముక్కులో ఏవో ఉన్నట్లు తేలింది. అవి ఏంటా అని పరీక్షించి చూడగా చాప్‌స్టిక్స్ అని అర్థమైంది. డాక్టర్లు షాక్ అయ్యారు. చాప్‌స్టిక్స్ లోపలికి ఎలా వెళ్లాయని అతడ్ని అడిగారు. మొదట అతడికి ఏం జరిగిందో.. ఎలా అవి ముక్కులోకి వెళ్లాయో అర్థం కాలేదు. బాగా ఆలోచించటంతో ఐదు నెలల కిందట జరిగిన ఓ సంఘటన గుర్తుకు వచ్చింది.


ఐదు నెలల క్రితం అంటే.. జూన్, జులై నెలల మధ్యలో అతడు మందు సిట్టింగులో ఉన్నాడు. ఆ టైంలో వేరే వ్యక్తితో గొడవపడ్డాడు. ఆ గొడవలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడి డాక్టర్లు వాటిని గుర్తించలేకపోయారు. గొడవ సందర్భంగా విరిగిన చాప్‌స్టిక్స్ ముక్కలు ముక్కులోకి వెళ్లి ఉంటాయని భావిస్తున్నాడు. డాక్టర్లు ముక్కు, మెదడులోకి వెళ్లిన చాప్‌స్టిక్స్‌ను బయటకు తీయడానికి సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయింది. అతడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆస్పత్రినుంచి కూడా డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, ఇలాంటి సంఘటనలు జరగటం ఇదేం మొదటి సారి కాదు.. ఓ యువతి తన చెల్లెలితో గొడవ పడి ఆమె ముక్కులో చాప్‌స్టిక్స్ దూర్చేసింది. అవి కాస్తా బ్రెయిన్‌లోకి వెళ్లిపోయాయి.


ఇవి కూడా చదవండి:

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు ఊరట..కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..

Kishan Reddy: రహదారులకు భూమి ఇవ్వండి

Updated Date - Apr 07 , 2025 | 06:51 AM