Suicide Plant: ఈ మొక్కను తాకితేనే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంట.. పాము విషం కంటే డేంజర్..
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:08 PM
Most Dangerous Plant In The World: భూమిపై ఉండే ఈ మొక్క అత్యంత విషపూరితమైంది. తాకిన వెంటనే బతకడం కంటే చనిపోవడం మేలనే అనుభూతిని కలిగిస్తుంది. పాము విషం కంటే అత్యంత ప్రమాదకరమని చెప్తున్న ఈ మొక్క పేరేంటి.. ఎక్కడ ఉంది.. సూసైడ్ ప్లాంట్ అని ఎందుకంటారో తెలుసుకుందాం..

Gympie Gympie Most Venemous Plant On Earth: చెట్లంటే మనిషికి ప్రాణవాయువు అందించేవి. పచ్చదనాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ ప్రకృతిలోని జీవులన్నింటికీ ఆధారంగా నిలిచేవి. మొక్కలు, చెట్లు లేకపోతే మానవ మనుగడే కష్టం. కానీ, ప్రపంచంలో జీవుల ప్రాణాలను బలితీసుకునే విషపూరితమైన మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది మాత్రం ఈ మొక్కే. దీనికి సూసైడ్ ప్లాంట్ అనే మరో పేరు కూడా ఉంది. దీన్ని పొరపాటున తాకినా భరించలేని నొప్పి కలుగుతుంది. బతకడం కంటే చావడం మేలు అనేంతలా మనసును ప్రేరేపిస్తుంది. ఇంతకీ, ఈ మొక్క ఎక్కడెక్కడ పెరుగుతుంది.. పాము విషం కంటే భయంకరమైనదని ఎందుకంటారు.. తదితర పూర్తి విశేషాలు..
అత్యంత సాధారణంగా కనిపించే జింపి జింపి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క. చాలా విషపూరితమైనది. ఎవరైనా దాన్ని ముట్టుకుంటే తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది. మనసులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే జింపీ జింపీ శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరాయిడ్స్. దీనిని ఆస్ట్రేలియన్ స్టింగ్ ట్రీ, స్టింగ్ బ్రష్, గింపీ స్టింగర్, మూన్‌లైటర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ప్రమాదకరమైన మొక్క ఆస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, మొలుక్కాస్ దీవులలో కూడా కనిపిస్తుంది.
జింపీ-జింపీ ఎందుకంత ప్రమాదకరం?
ఈ మొక్క ఆకులపై వెంట్రుకలలా కనిపించే పదునైన ముళ్లు ఉంటాయి. ఈ ముళ్ళలో న్యూరోటాక్సిన్ అనే అత్యంత విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఒక వ్యక్తి ఈ మొక్కను తాకినప్పుడు ముళ్ళు చర్మాన్ని గుచ్చుకుని విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.నిపుణుల ప్రకారం, తాకిన మరుక్షణమే మండే అనుభూతిని కలుగుతుంది. పోను పోనూ అది మరింత తీవ్రమై విపరీతమైన నొప్పి వస్తుంది. శరీరం మొత్తం ఎర్రగా కందిపోతుంది. ఈ నొప్పి దాదాపు 6 నెలలు గడిచినా పోదు. ఎందరో మనుషులు, జంతువులు పక్షులు ప్రాణాలను బలితీసుకుంది ఈ మొక్క. ఇప్పటికీ ఈ సమస్యకు నివారణా మందును కనిపెట్టలేదు డాక్టర్లు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
సూసైడ్ ప్లాంట్ అనే పేరు ఎలా వచ్చిదంటే?
ఓ అంతర్జాతీయ మీడియా ప్రకారం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ఆస్ట్రేలియన్ సైనికుడు పొరపాటున జింపి జింపి మొక్కను ముట్టుకున్నాడు. ఆ మొక్క ఆకుల వల్ల కలిగే నొప్పిని తట్టుకోలేక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి తెలియక వాటిని టాయిలెట్ పేపర్‌గా ఉపయోగించడం వల్లే ఇంత పని జరిగిందంట.
Read Also: Renuka Swami Case: మర్డర్ కేసు.. ప్రత్యక్ష సాక్షితో కలిసి సినిమా చూసిన దర్శన్
Funny Tomato Video: ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..