Share News

Worker Quits Job Over Pimple: యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:07 PM

ముఖంపై ఒకే ఒక పింపుల్ వచ్చిందని భయపడిపోయిన ఓ యువ ఉద్యోగికి జాబ్‌కు రాజీనామా చేశాడు. అతడి బాస్ షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.

Worker Quits Job Over Pimple: యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై
Worker Quits Job Over Pimple

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు అనేక రకాల చిక్కులు ఎదుర్కొంటున్న రోజులివి. జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీక అనేక మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కానీ కొందరు యువత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా తమకు జాబ్ అంటే పెద్ద లెక్కే లేనేట్టు ప్రవర్తిస్తూ పైఅధికారులకు షాకిలిస్తున్నారు. వీళ్లలో ఎలా వేగాలో తెలీక బాస్‌లు తెగ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తాజా ఉదంతం ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ముఖంపై మొటిమ వచ్చినందుకు ఓ వ్యక్తి రాజీనామా చేయడం ఓ బాస్‌కు అమితాశ్చర్యాన్ని కలిగించింది. ఆయన పెట్టింట పంచుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది (Worker Quits Job Over Pimple).

అసలేం జరిగిందీ సదరు బాస్ విపులంగా రెడిట్‌లో రాసుకొచ్చారు. ‘‘మా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌లో ఇటీవల మేము ఓ కొత్త వ్యక్తిని నియమించుకున్నాము. అతడు నియంత్రిత వాతావరణంలో భారీ యంత్రాలపై పి చేయాల్సి ఉంటుంది. వాటిని తరచూ ఆల్కహాల్‌తో శుభ్రపరచాల్సి వస్తుంది. అతడికి ఓ నెల రోజుల పాటు ట్రెయినింగ్ ఇచ్చి బాధ్యతలు అప్పగించాము. కానీ ఇటీవల ఓ రోజు సడెన్‌గా అతడి నుంచి మెసేజ్ వచ్చింది. అనారోగ్య కారణాలతో జాబ్ నుంచి తప్పుకుంటున్నానని అతడు తెలిపాడు. ఆ తరువాత నా నెంబర్ కూడా బ్లాక్ చేసేశాడు’’


‘‘అనారోగ్యం అని చెప్పగానే మొదట కాస్త కంగారు పడ్డా. కానీ అతడకి కాల్ చేద్దామంటే నెంబర్ బ్లాక్ చేశాడు. రెండు రోజుల తరువాత హెచ్ ఆర్ విభాగం ఓ వ్యక్తిని అతడి ఇంటికి పంపించింది. ముఖంప వచ్చిన ఒకే ఒక పింపుల్ కారణంగా తాను ఉద్యోగం మానేసినట్టు అతడు హెచ్ ఆర్ సిబ్బందికి తెలిపాడు. వాస్తవానికి అతడి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేది. అతడు హెల్త్ కేర్ చాలా తీసుకునేవాడు. మధ్యాహ్నం భోజనం కచ్చితంగా ఆఫీసులో పింగ్ పాంగ్ ఆడేవాడు. ఇలా ఆరోగ్యం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండటంతో అతడికి ముఖంపై మొటిమ రావడం బాగా ఆందోళన కలిగించిందనుకుంట. బహుశా ఇంత వరకూ అతడికి పింపుల్ ఎప్పుడూ రాలేదేమో. దీంతో, ఆఫీసు పని వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఫిక్సైపోయిన అతడు చివరకు జాబ్‌కు గుడ్‌పై చెప్పేశాడు’’ అని సదరు బాస్ చెప్పుకొచ్చారు.


ఇక ఈ ఉదంతంపై జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అతడి తీరు చూస్తుంటే నెత్తిలో తెల్ల వెంట్రుక మొలిచినందుకు రాజీనామా ఇస్తున్నట్టు ఉందని కొందరు అన్నారు. నేటి యువత మరీ సున్నితంగా ఉన్నారని మరొకరు అన్నాడు. జాబ్ కు రాజీనామా చేసేందుకు కట్టుకథ చెప్పి ఉండొచ్చని కొందరు సందేహించారు.

ఇవి కూడా చదవండి:

లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 14 , 2025 | 03:14 PM