Eagle Viral Video: డేగ వేటంటే ఇలాగే ఉంటుంది.. నీటిలోని చేపను ఎలా తినేసిందో చూస్తే..
ABN, Publish Date - Apr 04 , 2025 | 01:20 PM
ఆకలితో ఉన్న ఆకాశంలో విహరిస్తూ నేలపై ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎంతసేపు వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించదు. చివరకు నీటి మీదుగా వెళ్తూ లోపల ఉన్న చేపను టార్గెట్ చేస్తుంది. చివరకు దాన్ని వేటాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు..

గ్రద్ద, డేగ, రాబందుల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం గాల్లోకి లేపి మరీ చంపేస్తుంటాయి. కళ్లు మూసి తెరిచేలోగా వేటను తమ సొంతం చేసుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ డేగ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలోని చేపను వేటాడి తినేసిన డేగను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘డేగ వేటంటే ఈ మాత్రం ఉండాలి మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఆకాశంలో విహరిస్తూ నేలపై ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎంతసేపు వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించదు. చివరకు నీటి మీదుగా వెళ్తూ లోపల ఉన్న చేపను టార్గెట్ చేస్తుంది.
Lovers Funny Video: మేడపై ప్రియుడిని కలుసుకున్న యువతి.. కంటపడగానే ఏం చేసిందో చూస్తే.. ఖంగుతింటారు..
ఈ పూటకు ఈ చేపను ఎలాగైనా తినేయాలని ఫిక్స్ అవుతుంది. అనుకున్నదే తడవుగా.. గాల్లో నుంచి నేటిపైకి చేరుకుంటుంది. వచ్చీ రాగానే నీటిలోకి తన కాళ్లను ముంచి చేపను పట్టేసుకుని మళ్లీ గాల్లోకి లేస్తుంది. అప్పటికే ఆకలితో ఉండడంతో ఆగే ఓపిక లేక.. గాల్లోనే చేపను నోట్లో వేసుకుని మింగేస్తుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది.
Toilet Funny Video: వార్నీ.. టెక్నాలజీని ఇక్కడ కూడా వాడాలా.. ఈ బాత్రూంలో షవర్ చూస్తే..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ డేగ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మెరుపుదాడి అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2700కి పైగా లైక్‌లు, 1.72 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2025 | 01:20 PM