Hair Cutting: ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:22 PM
ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మంగళవారం నాడు మంగళివారు తమ కత్తికి పని చెప్పరు. అలాగే శుక్రవారం, పుట్టిన రోజు, అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో కటింగ్ చేయించవద్దని పెద్దలు చెబుతుంటారు.

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు కత్తిరించుకోవడం అంటే చాలా మందికి ఎంతో సరదాగా ఉంటుంది. వివిధ రకాల హెయిర్ స్టైల్స్‌తో అందంగా కనిపించేందుకు ఇదో మంచి మార్గం. ముఖ్యంగా యువతీయువకులు దీనిపై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. ఇంతకు ముందు కేవలం పురుషులు మాత్రమే కటింగ్ చేయించుకునేవారు. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆడవారు సైతం అందంగా కనిపించేందుకు జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఇందు కోసం వారికి బ్యూటీ పార్లర్లు మాదిరిగానే ప్రత్యేక దుకాణాలు సైతం వెలిశాయి.
అయితే ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మంగళవారం నాడు మంగళివారు తమ కత్తికి పని చెప్పరు. అలాగే శుక్రవారం, పుట్టిన రోజు, అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో కటింగ్ చేయించవద్దని పెద్దలు చెబుతుంటారు. ఇక, ఎక్కువ మందికి ఆదివారం రోజున సెలవు ఉండడంతో సెలూన్ షాపులకు క్యూ కడుతుంటారు. అయితే ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని, ఆరోగ్య సమస్యలూ ఎదురవుతాయని చెబుతున్నారు. అయితే ఆదివారం నాడు హెయిర్ కట్ చేయించకూడదనే నియమాన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసిస్తారు.
ఆ రోజున వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు, గోళ్లు కత్తిరించరు. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం వారు ఆదివారాన్ని సూర్య భగవానుడికి అంకితం చేస్తారు. సకల శక్తి, సంపద, ఆరోగ్యానికి ప్రతీకగా సూర్యుడిని భావిస్తారు. ఆ రోజున జుట్టు కత్తిరిస్తే సూర్య భగవానుడి ప్రతికూల ప్రభావం వారిపై పడుతుందని నమ్ముతారు. దీని వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. అందుకే ఆదివారం రోజున జుట్టు జోలికి వెళ్లరు. ఇక, దక్షిణ భారతదేశంలోనూ దాదాపు ఇలాంటి నమ్మకాలే ఉంటాయి. అయితే ఎక్కువ మంది ఆదివారం రోజును పెద్దగా పట్టించుకోరు. ఖాళీ సమయం దొరికేది అప్పుడే కాబట్టి హెయిర్ కటింగ్ సహా అనేక పనులు చేస్తుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆదివారం నాడు జుట్టు కత్తిరించకూడదనేది కేవలం నమ్మకం మాత్రమే, దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..