Hyderabad One Day Tour : రూ.380 ఖర్చుతోనే హైదరాబాద్ సిటీ టూర్.. తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్..
ABN, Publish Date - Mar 02 , 2025 | 04:09 PM
Telangana Tourism Hyderabad Tour : హైదరాబాద్ సిటీలో లెక్కలేనన్ని చారిత్రక, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలున్నాయి. వీటన్నింటిని ఒక్కసారైనా చూడాలని మీరూ కోరుకుంటున్నారా.. వీకెండ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సిటీ మొత్తం చూసేయాలని ఆశగా ఉందా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం తెచ్చిన ఈ ప్యాకేజీతో మీరు ఒక్క రోజులోనే హైదరాబాద్‌లోని అన్ని స్పెషల్ ప్లేసెస్ చూడవచ్చు. అదీ కేవలం రూ.380లు ఖర్చుతోనే.. ఎలాగంటే..

Telangana Tourism Hyderabad One Day Tour : హైదరాబాద్.. ఈ పేరు వినగానే.. బిర్యానీ, చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం కాలం నాటి కట్టడాలు ఇలా వరసపెట్టి ఎన్నో పేర్లు వెంటవెంటనే మనసులో మెదులుతాయి. నిజానికి, ఫ్యామిలితో విడిగా వెళితే హైదరాబాద్ సిటీని ఒక్కరోజులో చుట్టేయడం కష్టం. ఒకవేళ అన్ని ప్లేసెస్ చూడగలిగినా ఖర్చు తడిసి మోపెడవుతుంది. అయితే, మీ సమయం, ఖర్చు ఆదా అయ్యేందుకు తెలంగాణ టూరిజం ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ వన్డే టూరిజం (HYDERABAD ONE DAY TOUR PACKAGE) పేరిట తెచ్చిన ఈ ప్యాకేజీ కింద ఒక వ్యక్తి కేవలం రూ.380ల ఖర్చుతో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రాంతాలన్నీ చూసేయచ్చు. అదెలాగో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. ఉదయం 7:30కు ఆరంభమై సాయంత్రం 6:30కు ముగుస్తుంది. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు :
ప్రయాణ ప్రణాళిక :
ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి టూర్ ప్రారంభం. 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర, 8:15 గంటలకు బషీర్‌బాగ్ CRO ఆఫీస్ దగ్గర బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
బిర్లా మందిర్ సందర్శన.
చౌమహాల్లా ప్యాలెస్ (శుక్రవారం తప్ప), చార్మినార్, మక్కా మసీద్, లాడ్ బజార్‌లో నడుస్తూ షాపింగ్ చేయవచ్చు.
సాలార్‌జంగ్ మ్యూజియం చూశాక భోజన విరామం.
అనంతరం నిజాం జూబ్లీ పెవిలియన్ (శుక్రవారం తప్ప) విజిట్ చేస్తారు.
నెహ్రూ జూ పార్క్ (శుక్రవారాల్లో మాత్రమే)
యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రాత్మక కోట గోల్కొండ కోట సందర్శన.
కుతుబ్ షాహి సమాధులు (డ్రైవ్ ద్వారా బయటి వీక్షణ మాత్రమే)
చివరగా ఐమాక్స్ రోడ్ ఖైరతాబాద్ లుంబినీ పార్క్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ఛార్జీలు :
నాన్ ఏసీ బస్సులు : పెద్దలకు రూ.430, పిల్లలు (5-12 సంవత్సరాలు) రూ. 350
ఏసీ బస్సులు : పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400
బుకింగ్ :
ఆన్‌లైన్ బుకింగ్: తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఆఫ్‌లైన్ బుకింగ్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లోని తెలంగాణ పర్యాటక కార్యాలయంలో అందుబాటులో ఉంది.
గమనిక : శుక్రవారాల్లో చౌమహాల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం జూబ్లీ పెవిలియన్ చూడలేరు. అందుకు బదులుగా నెహ్రూ జూ పార్క్ సందర్శిస్తారు. షాపింగ్, అల్పహారం, భోజనం వంటి వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఈమెయిల్: mailto:info@telanganatourism.gov.in సంప్రదించండి. టికెట్ బుకింగ్ తదితర వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Read Also : Kedarnath opening date 2025: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్ న్యూస్ ...
IRCTC Andaman Tour 2025: హైదరాబాద్ టు అండమాన్.. సమ్మర్ కోసం ...
Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా ...
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 02 , 2025 | 04:19 PM