Flight Window Shades: టేకాఫ్ సమయంలో విమానం కిటికీల షేడ్స్ తెరిచుంచాలి.. ఇలా ఎందుకంటే..
ABN , Publish Date - Apr 14 , 2025 | 09:17 PM
విమానం టేకాఫ్ ల్యాండింగ్ సందర్భాల్లో కిటికీలకు ఉన్న తెరలను తెరిచుంచాలని ప్రయాణికులకు క్రూ సిబ్బంది సలహా ఇస్తారు. ఇలా ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: విమానం టేకాఫ్ సమయంలో క్రూ ప్రయాణికులను కిటికీలకు ఉన్న షేడ్స్ (తెరలు) తెరిచి ఉంచాలని క్రూ సూచిస్తారు. ఇలా ఎందుకూ అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే, ఈ కథనం మీ కోసమే
కిటికీల షేడ్స్ తెరిచి ఉంచడం వెనక భద్రతా పరమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విమాన ప్రమాదాల సమయంలో ఇది అక్కరకు వస్తుందని అంటున్నారు
షేడ్స్ తెరిచి ఉంచడం వల్ల ప్రయాణికులు బయటి వెలుతురుకు అలవాటు పడతారు. దీంతో, ఎమర్జెన్సీ సందర్భాల్లో వారు వేగంగా స్పందించేందుకు అవకాశం చిక్కుతుంది.
షేడ్స్ తెరిచి ఉంచడం ద్వారా టేకాఫ్ సందర్భాల్లో పరిసరాలపై ఓ కన్నేసి ఉంచే అవకాశం అటు ప్రయాణికులకు ఇటు సిబ్బందికి చిక్కుతుంది. దీంతో, రాబోయే అపాయాన్ని ముందుగానే గుర్తించి సమస్య పెద్దదయ్యేలో వేగంగా స్పందించే అవకాశం దక్కుతుంది.
ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భాల్లో ఏవైపు నుంచి విమానం దిగొచ్చనే విషయాన్ని కూడా త్వరగా నిర్ణయించొచ్చు.
ఎయిర్‌బస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మెజారిటీ విమాన ప్రమాదాలు టేకాఫ్, ల్యాండింగ్ సందర్భాల్లోనే జరుగుతుంటాయి. కాబట్టి, ఈ సమయాల్లో పరిసరాలపై వీలైనంతగా దృష్టిపెట్టేందుకు కిటీకలకు ఉన్న తెరలను పైకి ఎత్తాలి.
అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో కచ్చితంగా తెరలను పైకెత్తాలన్న నియమం ఏదీ లేదు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా ఈ సూచన పాటించాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చెబుతోంది. దీని ద్వారా ప్రయాణికులు, క్రూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రమాదసమయాల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని తెలుపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి
రష్యా ఘనత.. నెల రోజుల్లో అంగారకుడిని చేరే రాకెట్