Share News

Lost Train Ticket Rules: ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:15 PM

రైలు ప్రయాణాల సందర్భంగా టిక్కెట్ పోగొట్టుకున్నప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Lost Train Ticket Rules: ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..
Lost Train Ticket Rules

ఇంటర్నెట్ డెస్క్: సామాన్య భారతీయులకు అందుబాటులో ఉన్న చవకైన ప్రయాణ సాధనం రైళ్లే. దీంతో, అనేక మంది సుదూర ప్రయాణాలకు రైళ్లనే ఎంచుకుంటారు. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలను అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటుంది. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానకర్తగా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది (Lost Train Ticket Rules).

ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ రకాల రైల్వే టిక్కెట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. రిజర్వేషన్, తత్కాల్ టిక్కెట్లతో పాటు వెయింట్ లిస్టులో కూడా టిక్కెట్టు కోసం ప్రయాణికులు ట్రై చేయొచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ట్రెయిన్ టిక్కెట్ పొగొట్టుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో రైల్వే ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచింది.


టిక్కెట్ చిరిగిపోయినా లేక పోగొట్టుకున్నా..

సాధారణంగా టిక్కెట్ లేకపోతే ప్రయాణికులకు రైళ్లల్లోకి అనుమతి లేదు. కానీ టిక్కెట్ చిరిగిపోయినా లేక పోగొట్టుకున్న వారిని టిక్కెట్ లేని ప్రయాణికులుగా రైల్వే పరిగణించదు. వీరి కోసం కొన్ని ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచింది. టిక్కెట్ పోగొట్టుకున్న వార టీటీఈకి అదనపు రుసుము చెల్లించి డూప్లికేట్ టిక్కెట్ పొందొచ్చు. ఈ సందర్భంగా ఐటీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ టిక్కెట్ అందుబాటులో ఉన్న వారికి డూప్లికేట్ టిక్కెట్ అవసరమే ఉండదు. సింపుల్‌గా టీటీఈకి ఈ-టిక్కెట్ చూపిస్తే సరిపోతుంది.

టిక్కెట్ లేకుండా దొరికిపోతే..

టిక్కెట్ లేకుండా రైళ్లల్లో ప్రయాణించే వారికి చిక్కులు తప్పవు. ఇలా దొరికిపోయినప్పుడు టిక్కెట్ డబ్బులతో పాటు అదనంగా ఫైన్ కూడా చెల్లించాలి. దీని కనీస మొత్తం రూ.250 మొదలు టిక్కెట్ ధరకు రెండింతలు వరకూ ఉండొచ్చు. టీటీఈకి ఫైన్ చెల్లించని పక్షంలో తదుపరి వచ్చే స్టేషన్‌లో దింపేయడంతో పాటు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.

జర్నీ మధ్యలో టిక్కెట్ కొనుగోలు..

రైలెక్కాక టిక్కెట్ కొనొచ్చని కొందరు అనుకుంటారు. అయితే, సీట్ల లభ్యత బట్టి ఇది ఆధారపడి ఉంటుందని మర్చిపోకూడదు. ఇలాంటప్పుడు టిక్కెట్ ధరకు తోడు అదనపు చార్జీ చెల్లించాల్సి రావచ్చు.


ఇక రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణం మూడు గంటలకు మించి ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులు రిఫండ్ కోరే అవకాశం ఉంది. ఇందుకు కోసం టీడీఆర్ ఫైల్ సమర్పించాల్సి ఉంటుంది. రైల్లో కోరీ లేదా దాడులు జరిగినప్పుడు హెల్ప్‌లైన్ నెంబర్ 139కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా టీటీఈకి, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

వృద్ధుడిని చీదరించుకుంటున్న జనం.. ఇతడు ఏం చేశాడో తెలిస్తే..

17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ

యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

Read Latest and Viral News

Updated Date - Apr 15 , 2025 | 04:15 PM