Manchu Lakshmi Emotional: మంచు మనోజ్‌ను చూసి అక్క భావోద్వేగం.. స్టేజ్ పైనే కూర్చుని..
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:07 PM
మంచు కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి కోసం కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య వివాదాలు రోజుకోటి వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే..

Manchu Lakshmi Emotional on Manoj: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఓవైపు ఉండగా, మంచు మనోజ్ మరోవైపు పోరాడుతున్నారు. ఆస్తి కోసం నిత్యం గొడవలు, పోలీస్ కేసులు అంటూ ఏదో ఒక రూపంలో మంచు కుటుంబం విభేదాలు వీధికెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
అక్క ఎమోషనల్..
మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన సోదరి మంచు లక్ష్మిని కలిశాడు. వేదికపైన ఉన్న అక్క మంచు లక్ష్మిని వెనుక నుండి వచ్చి మనోజ్ ఆశ్చర్యపరిచాడు. లక్ష్మి వెనక్కి తిరిగి తన సోదరుడు మనోజ్‌ని చూడగానే వెంటనే భావోద్వేగానికి గురైంది. తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబంలో జరుగుతున్న తగాదాల మధ్య మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మి ఎమోషనల్ అయింది. ఏడుస్తున్న అక్కను మనోజ్ హత్తుకుని ఉండగా ఇంతలోనే మనోజ్ భార్య మోనికా వచ్చి అమెని ఓదార్చింది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే, మంచు కుటుంబంలో కొంతకాలంగా ఆస్తి వివాదం ముదురుతోన్న సంగతి తెలిసిందే. మనోజ్ తన సోదరుడు మంచు విష్ణు తనను ఇబ్బంది పెట్టాడని ఆరోపించాడు. ఈ వివాదంపై ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. బహిరంగ ఘర్షణలు కూడా చేసుకున్నారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న విభేదాలు టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read:
Chiranjeevi: మా బిడ్డ మార్క్ క్షేమం
Renu Desai: పొలిటికల్ ఎంట్రీ.. రహస్యంగా దాచేది కాదుగా..
Priyadarshi: 25కి సారంగపాణి జాతకం వాయిదా