Monkey Funny Video: నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సింది తీసుకో.. కోతి అతి తెలివి చూస్తే నోరెళ్లబెడతారు..

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:01 PM

కొన్ని కోతులు తమకు కావాల్సిన ఆహారాన్ని బలవంతంగా లాక్కుంటే.. మరికొన్ని కోతులు ఎంతో తెలివిగా ఆహారాన్ని తమ వద్దకే రప్పించుకుంటుంటాయి. ఇలాంటి విచిత్రమైన కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Monkey Funny Video: నాక్కావాల్సింది ఇచ్చుకో.. నీక్కావాల్సింది తీసుకో.. కోతి అతి తెలివి చూస్తే నోరెళ్లబెడతారు..

కోతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కోతులు ప్రవర్తించే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని కోతులు తమకు కావాల్సిన ఆహారాన్ని బలవంతంగా లాక్కుంటే.. మరికొన్ని కోతులు ఎంతో తెలివిగా ఆహారాన్ని తమ వద్దకే రప్పించుకుంటుంటాయి. ఇలాంటి విచిత్రమైన కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి తెలివిగా చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కోతి వీక్‌నెస్ పట్టేసిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఫోన్‌కు ఎంతలా ఎడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డబ్బులు పోయినా బాధపడరు గానీ.. ఫోన్ పోతే మాత్రం తెంగ కంగారుపడిపోతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ కోతి ఈ వీక్‌నెస్‌ను పట్టేసిందన్నమాట.

Viral Video: పైప్‌లైన్ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని కట్ చేసి చూడగా.. గుండెల్ని పిండేసే సీన్..


ఏ వస్తువును ఎత్తుకెళ్తే తన పని జరుగుతందో బాగా తెలిసిన ఓ కోతి.. పర్యాటకుడి చేతిలోని (Monkey stole the phone) స్మార్ట్ ఫోన్‌ను ఎత్తుకెళ్లింది. దాన్ని తీసుకుని భవనంపై కూర్చుంది. కోతి ఫోన్ ఎత్తుకెళ్లడంతో కంగారుపడిపోయిన ఆ వ్యక్తి.. దాన్ని తిరిగి తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా కోతి మాత్రం ఫోన్‌ను ఇవ్వకుండా భీష్మించుకుంది. చివరకు విషయం అర్థం చేసుకున్న అతను.. కోతి ఇష్టపడే ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఫ్రూటీ ప్యాకెట్‌ను తీసుకొచ్చి కింద నుంచి కోతికి చూపించాడు. తర్వాత దాన్ని కోతి వైపు విసిరాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సరిగ్గా కోతి వద్దకు విసిరేశాడు.

Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..


ఫ్రూటీ ప్యాకెట్‌ను (Fruity packet) అందుకున్న కోతి.. ‘‘నేను ఏం కోరుకున్నావో అదే తెచ్చావ్.. డీల్ ఓకే.. ఇదిగో తీసుకో నీ ఫోన్’’.. అని అన్నట్లుగా వెంటనే ఫోన్‌ను కిందకు పడేస్తుంది. దాన్ని తీసుకున్న ఆ వ్యక్తి సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడన్నమాట. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి డీల్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతి పెద్ద గ్యాంగ్‌స్టర్‌లా మారిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 8.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 02:15 PM