Viral Video: ఓర్నీ దుంపతెగా..! కోతుల పాలిట యముడిలా తయారయ్యాడుగా.. ఎలా భయపెడుతున్నాడో చూస్తే..
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:46 PM
చాలా కోతులు గుంపులు గుంపులుగా ఓ చోట చేరి అరటిపండ్లను తినేస్తుంటాయి. వాటిని తరిమేయాలని చాలా మంది అనుకున్నా కూడా భయంతో ఆగిపోయారు. అయితే ఓ వ్యక్తి వాటిని ఎలాగైనా బెదరగొట్టి.. అక్కడి నుంచి పంపించేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం..

కోతులు కొన్నిసార్లు వినోదాన్ని పంచితే.. మరికొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. దౌర్జన్యం చేసి మరీ ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. మరికొన్నిసార్లు దాడులు చేసి గాయపరుస్తుంటాయి. దీంతో వాటి బెడద నుంచి బయటపడేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోతులను వినూత్నంగా భయపెట్టిన వ్యక్తిని చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కోతుల పాలిట యముడిలా తయారయ్యాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా కోతులు గుంపులు గుంపులుగా ఓ చోట చేరి (Monkeys eating bananas) అరటిపండ్లను తినేస్తుంటాయి. వాటిని తరిమేయాలని చాలా మంది అనుకున్నా కూడా భయంతో ఆగిపోయారు. అయితే ఓ వ్యక్తి వాటిని ఎలాగైనా బెదరగొట్టి.. అక్కడి నుంచి పంపించేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం ఏం చేయాలనే విషయంపై వివిధ రాకలుగా ఆలోచించాడు.
Viral Video: చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో.. హీటర్‌తో ఇతను చేసిన పని చూస్తే..
చివరకు అతడికి ఓ బంపర్ ఐడియా తట్టింది. కోతులు రాకముందే ఆ ప్రదేశంలో ఓ పులి బొమ్మను పెట్టి, దానిపై దుప్పటి కప్పి ఉంటాడు. తర్వాత అరటి పండ్లను వేయగా.. కోతులన్నీ అక్కడికి వచ్చి తినడం స్టార్ట్ చేస్తాయి. కాసేపటి తర్వాత అతను మెల్లగా వాటి వద్దకు వెళ్లి, పులి బొమ్మపై ఉన్న దుప్పటిని లాగేస్తాడు. ఇంకేముందీ.. ఒక్కసారిగా పులి బొమ్మను చూడగానే (Monkeys ran away after seeing the tiger toy) కోతులన్నీ .. ‘‘వామ్మో.. పులి..లగెత్తండ్రో...’’.. అన్నట్లుగా అన్నీ కలిసి తలోదారికి పరుగులు తీస్తాయి.
Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..
చూస్తుండగానే అక్కడున్న కోతులన్నీ దూరంగా పారిపోయాతాయి. ఇలా పులి బొమ్మతో కోతులను బెదరగొట్టడాన్ని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి ఐడియారా నాయనా.. కోతులకు చుక్కుల చూపించావుగా’’.. అంటూ కొందరు, ‘‘తినే సమయంలో కోతులను ఇలా భయపెట్టడం సరికాదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, 82 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఐఫోన్ దొంగను చితకబాదిన యువకులు.. మధ్యలో ఫోన్ స్ర్కీన్ చూడగా షాకింగ్ సీన్.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 21 , 2025 | 12:46 PM