Viral Video: పిల్ల ఏనుగును నిద్రలేపడం ఇంత కష్టమా.. తల్లి ఏనుగు ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 09:53 PM
ఏనుగులు చూడటానికి గంభీరంగా కనిపించినా.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. మనుషుల్లాగే ఏనుగులకు కూడా అప్పుడప్పుడూ అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏనుగుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..
ఏనుగులు చూడటానికి గంభీరంగా కనిపించినా.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. మనుషుల్లాగే ఏనుగులకు కూడా అప్పుడప్పుడూ అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏనుగుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ తల్లి ఏనుగుకు ఎదురైన విచిత్ర అనుభవానికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. పిల్ల ఏనుగును నిద్రలేపడం తల్లి ఏనుగుకు పెద్ద సవాల్‌గా మారింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ షెడ్డులో పిల్ల ఏనుగు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. చిన్న పిల్లల తరహాలోనే ఈ పిల్ల ఏనుగు కూడా తెల్లవారి చాలా సేపు అవుతున్నా పడుకునే ఉంటుంది. కాసేపటికి అటుగా వచ్చిన తల్లి ఏనుగు.. తన పిల్లను లేపేందుకు ప్రయత్నిస్తుంది. ముందు సున్నితంగా తట్టగా.. పిల్ల ఏనుగు ఏమాత్రం లెక్కచేయదు. తొండంతో విదిలిస్తూ అలాగే పడుకుండిపోతుంది.
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
అయినా తల్లి ఏనుగు దాన్ని లేపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో పిల్ల ఏనుగు తోక పట్టుకుని అటూ, ఇటూ తిప్పుతుంది. తర్వాత కడుపుపై తొండం పెట్టి కదిలిస్తుంది. ఇలా చాలా సార్లు కదిలించడంతో (mother elephant wakes up the baby elephant) చివరకు పిల్ల ఏనుగు అయిష్టంగానే నిద్రలేస్తుంది. లేచిన తర్వాత తల్లి ఏనుగు వద్దకు వెళ్లి నిలబడుతుంది. ‘‘ఉదయాన్నే నిద్రలేవాలి నాన్నా.. అంత సేపు పడుకోకూడదు’’.. అన్నట్లుగా తల్లి ఏనుగు తన పిల్లను దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకుంటుంది.
Viral Video: గ్రామంలోకి చొరబడిన చిరుత.. సడన్‌గా తోక పట్టుకున్న వ్యక్తి.. చివరకు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ తల్లి ఏనుగుకు పెద్ద కష్టమే వచ్చిపడిందే’’.. అంటూ కొందరు, ‘‘మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లు, 15 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 08 , 2025 | 09:53 PM