Woman: ఓ వైపు కిడ్నీలు పాడైన భర్త.. మరో వైపు 14 రోజుల పసికందు.. చివరకు తల్లి తీసుకున్న షాకింగ్ నిర్ణయం..

ABN, Publish Date - Mar 28 , 2025 | 10:15 AM

పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. తల్లి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ వారిని కాపాడుకుంటుంది. ఇంత గొప్పమనసున్న తల్లి కూడా కొన్నిసార్లు కనికరం లేకుండా ప్రవర్తిస్తుందంటే.. అవుననే చెప్పాల్సి వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం..

Woman: ఓ వైపు కిడ్నీలు పాడైన భర్త.. మరో వైపు 14 రోజుల పసికందు.. చివరకు తల్లి తీసుకున్న షాకింగ్ నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం

నవమాసాలు మోసి, కని పెంచి పిల్లలకు జన్మనిచ్చే తల్లి.. వారు పెరిగి పెద్దయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అనుక్షణం వారిని కనిపెట్టుకుంటూ రక్షణగా నిలుస్తుంది. పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే.. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ వారిని కాపాడుకుంటుంది. ఇంత గొప్పమనసున్న తల్లి కూడా కొన్నిసార్లు కనికరం లేకుండా ప్రవర్తిస్తుందంటే.. అవుననే చెప్పాల్సి వస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ తల్లి ఇలాంటి పనే చేసింది. ఓ వైపు కిడ్నీలు పాడైన భర్త, మరోవైపు 14 రోజుల పసికందుతో ఆ తల్లి ఒక్కసారిగా కర్కశంగా మారిపోయింది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మైలార్‌దేవ్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన మనీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. మైలార్ దేవ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. భర్త మనీ, భార్య విజ్జు కలిసి కాటేదాన్ లోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తుండేవారు. ఇలా సాగుతున్న వీరి జీవితం.. ఒక్కసారిగా తలకిందులైంది.

Viral Video: ఇలాంటి శాడిస్టును ఏం చేయాలో చెప్పండి.. యువతి వెనుక స్కర్టుకు నిప్పంటించడంతో..


భర్త మనీ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు.. అతడి రెండు కిడ్నీలు పాడయ్యాయయని చెప్పారు. ఈ వార్త వినగానే వారిపై ఒక్కసారిగా పిడుగుపడ్డట్లయింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కిడ్నీలు మార్పించలేని పరిస్థితి. అయినా ఎలాగోలా కష్టపడి భర్తకు డయాలిసీస్ చేయిస్తోంది భార్య. ఈ క్రమంలో భార్య ఇటీవల విజ్జు.. బిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు భర్త బాగోగులు చూసుకోవడం, మరోవైపు పసికందు ఆలనాపాలనా చూసుకోవడం ఆమెకు ఎంతో భారంగా మారింది.

Auto Accident Viral Video: కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. ఈ ఆటో డ్రైవర్‌ నిర్వాకానికి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


భర్తను పదే పదే డయాలిసీస్‌కు తీసుకెళ్లడంతో పాటూ బిడ్డ యోగక్షేమాలు చూసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో చివరకు ఇటీవల ఓ రోజు ఏ తల్లీ తీసుకోని నిర్ణయం తీసుకుంది. 15 రోజుల పసికందు అని కూడా చూడకుండా చంపేద్దామని ఫిక్స్ అయింది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు (Mother threw baby in bucket) బిడ్డను నీళ్ల బకెట్‌లో ముంచేసింది. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ‘‘అయ్యో.. నా బిడ్డ బకెట్‌లో పడిపోయింది’’.. అని ఏడవడం స్టార్ట్ చేసింది.

Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తాను స్నానం చేసి వచ్చేసరికి బిడ్డ బకెట్‌లో పడిపోయిందని చెప్పింది. అయితే ఆమె చెప్పిన దానికి, ఘటన జరిగిన తీరుకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. చివరకు నేరం అంగీకరంచింది. ఆర్థిక సమస్యల కారణంగానే తన బిడ్డను హత్య చేసినట్లు నిందితురాలు పేర్కొంది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2025 | 10:33 AM