Viral Video: గుండెను పిండేసే సీన్.. కుంభమేళాలో ఈ పెద్దాయన చేస్తున్న పని చూడండి..
ABN, Publish Date - Feb 07 , 2025 | 09:25 PM
కుంభమేళాకు దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. ఇప్పటిదాకా ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే తాజాగా, ఓ వృద్ధుడి వీడియో అందరనీ భావోద్వేగానికి గురి చేస్తోంది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుంభమేళాకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తు్న్నాయి. భక్తుల పుణ్యస్నానాలకు సంబంధించిన వీడియోలతో పాటూ పూసలు విక్రయించే మోనాలిసా వీడియోలు కూడా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే కొందరు యువతులు స్నానం చేసే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించి భక్తుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా, గుండెల్ని పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కుంభమేళా ప్రాంతంలోని ఇసుకలో ఓ పెద్దాయన చేస్తున్న పని చూసి అంతా.. ‘‘అయ్యో పాపం’’.. అంటూ జాలి చూపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. ఇప్పటిదాకా ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే తాజాగా, ఓ వృద్ధుడి వీడియో అందరనీ భావోద్వేగానికి గురి చేస్తోంది.
ఇసుకలో పడుకున్న పెద్దాయన.. పక్కనే ఓ టవల్ పరిచాడు. అక్కడే కొంత ఇసుక తీసుకుని ఎత్తుగా పోశాడు. తర్వాత దాన్ని మహిళ రూపంలో తయారు చేశాడు. ఇలా చివరకు ఇసుకతో మహిళ తలను తీర్చిదిద్దాడు. విషయం ఏంటా అని ఆరాతీయగా.. ఈ పెద్దాయన భార్య కుంభమేళాలో చనిపోయినట్లు తెలిసింది. భార్యను ఎంతగానో ప్రేమించిన ఈయన.. ఇలా ఇక్కడికి వచ్చి.. ఆమెను తలచుకుంటూ (old man made wife's face in sand) ఇలా ఇసుకలతో బొమ్మను చేసినట్లు తెలిసింది.
ఆ సమయంలో వృద్ధుడి ముఖంలో భార్యపై ఉన్న ప్రేమ, ఆమె దూరమైందనే బాధ స్పష్టంగా కనిపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్యపై ఈ పెద్దాయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కాలంలో ఇలాంటి భర్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 07 , 2025 | 09:25 PM