Crime: 78 ఏళ్ల తల్లిని చూడటానికి వచ్చిన కూతురు.. సీసీ ఫుటేజీలో షాకింగ్ సీన్.. ఇంట్లోకి వచ్చిన 20 ఏళ్ల యువకుడు..

ABN, Publish Date - Jan 25 , 2025 | 12:01 PM

78 ఏళ్ల మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇటీవల ఆమె కూతురు చూడటానికి వచ్చింది. అయితే తల్లి దుస్తులు చూసి అనుమానం వచ్చి ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించి షాక్ అయింది. ఇంట్లోకి వచ్చిన 20 ఏళ్ల యువకుడు చివరకు దారుణానికి పాల్పడ్డాడు..

Crime: 78 ఏళ్ల తల్లిని చూడటానికి వచ్చిన కూతురు.. సీసీ ఫుటేజీలో షాకింగ్ సీన్.. ఇంట్లోకి వచ్చిన 20 ఏళ్ల యువకుడు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక ఒంటరిగా ఉన్న మహిళలకైతే రక్షణ లేకుండా పోతోంది. బాలికలు మొదలుకొని వృద్ధుల వరకూ అంతా ఏదో ఒక రకంగా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొందరు మృగాళ్లు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడోచోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధిచిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ 78 ఏళ్ల తన తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో (Mumbai) చోటు చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక దిండోషి ప్రాంత పరిధిలో 78 ఏళ్ల మహిళ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె కూతురు, అల్లుడు సమీపంలోనే వేరే ఇంట్లో ఉంటున్నారు. అలాగే ఈమె చెల్లెలు కూడా ఇదే ప్రాంతలో ఉంటుంది. వీళ్లు అప్పుడప్పుడూ వృద్ధురాలి (Old Woman) ఇంటికి వచ్చి యోగక్షేమాలు చూసి వెళ్తుండేవారు.

Woman: కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..


వృద్ధురాలు బుద్ధిమాంద్యంతో పాటూ జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతుండడంతో ఆమె రక్షణ నిమిత్తం ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. జనవరి 12న వృద్ధురాలిని పరామర్శించేందుకు ఆమె కూతురు వచ్చింది. తల్లిని చూడగానే ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోని సీసీ ఫుటేజీ పరిశీలించింది. జనవరి 8న వృద్ధురాలి ఇంట్లోకి వచ్చిన 20 ఏళ్ల యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసి షాకైన కూతురు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడదిని రెండు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: అవి దంతాలా లేక ఇనుక కడ్డీలా.. ఈ బాలుడి విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కొంత కాలంగా వృద్ధురాలిని తాను గమనిస్తున్నానని, ఓ రోజు ఆమె దుస్తులు చెల్లాచెదురుగా ఉండడం చూసి ఘాతుకానికి పాల్పడ్డట్లు చెప్పాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: కొంప కూల్చే ట్రిక్స్ అంటే ఇవే.. గ్యాస్ తక్కువగా ఉందని ఇతను చేసిన నిర్వాకమిదీ..

Updated Date - Jan 25 , 2025 | 12:02 PM