Father And Daughter: ముగ్గురు కూతుళ్ల తండ్రి.. నాలుగుసార్లు గర్భం దాల్చిన పెద్ద కూతురు.. చివరకు తల్లి విచారించగా..

ABN, Publish Date - Feb 28 , 2025 | 09:28 AM

56 ఏళ్ల ఓ వ్యక్తికి భార్య, 15, 17, 21 వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇతడిపై 1980, 90లలో దోపిడీ, కాల్పులు, హత్య వంటి పలు కేసుల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఓ రోజు అతను ఏకంగా తన కూతుళ్లపైనే కన్నేశాడు. పెద్ద కూతురు నాలుగు సార్లు గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Father And Daughter: ముగ్గురు కూతుళ్ల తండ్రి.. నాలుగుసార్లు గర్భం దాల్చిన పెద్ద కూతురు.. చివరకు తల్లి విచారించగా..
ప్రతీకాత్మక చిత్రం

తన కటుంబం సంతోషం కోసం తన సుఖాలను త్యాగం చేసి, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తాడు తండ్రి. అందుకే ప్రతి ఇంట్లో తండ్రికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంటుంది. అయితే కొందరు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తూ.. తండ్రి స్థానానికే మచ్చ తెస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. చివరకు వారిపైనే కన్నేశాడు. పెద్ద కూతురు నాలుగు సార్లు గర్భం దాల్చడంతో తల్లికి అనుమానం కలిగింది. విచారించగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.


పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్ర (Maharashtra, Mumbai) ముంబైలోని నలసోపారా వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ఓ వ్యక్తికి భార్య, 15, 17, 21 వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇతడిపై 1980, 90లలో దోపిడీ, కాల్పులు, హత్య వంటి పలు కేసుల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతడికి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ గ్యాంగ్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఇతడంటే స్థానికుల్లో భయం ఉండేది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న గుర్రాన్ని.. 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు కంటి సమస్యలు లేనట్లే..


దీన్ని అవకాశంగా తీసుకున్న అతను అనేక దౌర్జన్యాలకు పాల్పడుతూ వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొన్నేళ్ల కిందట అతను ఏకంగా తన సొంత కూతుళ్ల పైనే కన్నేశాడు. భార్య లేని సమయంలో ఒకరికి తెలీకుండా (father misbehaving with daughters) మరొకరిపై బలత్కారానికి పాల్పడ్డాడని చెప్పారు. బయట చెబితే చంపేస్తానని చెప్పడంతో వారు కూడా బయటికి చెప్పలేదని తెలిపారు. ఇలా 2018 నుంచి ఇప్పటి వరకూ కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.

Poori Making Video: పూరీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఇతనెలా సింపుల్‌గా చేసేస్తున్నాడో చూడండి..


ఈ క్రమంలో నిందితుడి పెద్ద కూతురు మొత్తం నాలుగు సార్లు గర్భం దాల్చిందని పోలీసు విచారణలో తెలిసింది. అయితే ఇటీవల తల్లికి అనుమానం వచ్చి.. కూతుళ్లను కూర్చోబెట్టి గట్టిగా నిలదీసింది. విషయం తెలియడంతో వారిని తీసుకుని, నలపోవారాలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తర్వాత పెద్ద కుమార్తె ధైర్యం చేసి తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు కేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Cat And Pigeon Video: నిద్రపోతున్న పిల్లి.. సమీపానికి వచ్చిన పావురం.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2025 | 12:57 PM