Snake Viral Video: పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే అవుతుంది.. పనసకాయ చెట్టుపై పాము చేసిన పని చూస్తే..
ABN, Publish Date - Apr 04 , 2025 | 08:23 AM
ఓ వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి పనసకాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము కాళ్లను చుట్టేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

కొందరు తప్పని తెలిసినా నేరాలు చేస్తూ చివరకు పశ్చాత్తాపపడుతుంటారు. మరికొందరు పరాయిసొమ్ముపై ఆశపడి చోరీలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో దానికి తగిన శిక్షను అనుభవించాల్సి వస్తుంటుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ వ్యక్తి పనసచెట్టుపై కాయలు చోరీ చేయాలని వెళ్లగా.. సడన్గా అతడి కాళ్లను పాము చుట్టేసింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పరాయి సొమ్ముపై ఆశపడితే ఇలాగే అవుతుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి పనసకాయలు (Jackfruit) కోసేందుకు చెట్టు ఎక్కాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Python VS Crocodile: కొండచిలువతో పవర్ ఎప్పుడైనా చూశారా.. అంత పెద్ద మొసలిని సైతం..
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పాము చెట్టు పైకి ఎక్కింది. చూస్తుండగానే (snake wrapped around man's legs) అతడి కాళ్లను చుట్టేసింది. కాళ్లకు పాము చుట్టుకోవడం చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాన్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినా పాము అతడి కాళ్లను వదలకుండా చుట్టేసి, అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇలా అతను చాలా సేపు పాము నుంచి తప్పించుకోవాలని చూడగా పాము మాత్రం అతన్ని వదల్లేదు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Funny Singing Video: టోటల్ రివర్స్.. వీళ్లు ఎలా పాడుతున్నారో చూస్తే.. నవ్వలేక చస్తారు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పాము బాగా బుద్ధి చెప్పిందిగా’’.. అంటూ కొందరు, ‘‘చెట్టుపై దూకడం కంటే అలాగే ఉండడం మేలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమ్జీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 7.62 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మరణాన్ని గెలవడమంటే ఇదేనేమో.. చితిపై పడుకోబెట్టగానే ఏం జరిగిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2025 | 08:23 AM