ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రాజసానికి నిలువెత్తు నిదర్శనమంటే ఇదే.. ఒక్కసారి ఈ పులిని చూశారంటే...

ABN, Publish Date - Jan 05 , 2025 | 10:44 AM

పులులు, సింహాలు చూడటానికి ఎంత భయకరంగా కనిపిస్తుంటాయో.. వాటి ప్రవర్తన చూస్తే అంతే రాజసంగా అనిపిస్తుంటుంది. జంతువు కోసం మాటు వేయడం, వేటాడే సమయంలో వేగంగా పరుగెత్తడం ఇలా ప్రతి కదలికలోనూ ఠీవీగా ఉంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

tiger royal walk

పులులు, సింహాలు చూడటానికి ఎంత భయకరంగా కనిపిస్తుంటాయో.. వాటి ప్రవర్తన చూస్తే అంతే రాజసంగా అనిపిస్తుంటుంది. జంతువు కోసం మాటు వేయడం, వేటాడే సమయంలో వేగంగా పరుగెత్తడం ఇలా ప్రతి కదలికలోనూ ఠీవీగా ఉంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పులి అని పేరు పెట్టింది ఇందుకేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహిత్ రాయ్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌కు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఫారెస్ట్ రైడ్‌‌కు వెళ్లిన అతను.. మార్గ మధ్యలో ఓ పులిని చూశాడు. రోడ్డుపై ఠీవీగా నడుస్తూ వస్తున్న పులిని చూసి షాకైన అతను వెంటనే ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు.

Viral Video: వయసు చూస్తే 84.. విన్యాసాలు చూస్తే యువతకే సవాల్.. బామ్మా నీకు హ్యాట్సాప్..


రోడ్డుపై పడుకున్న పులిని చూసి వాహనాలన్నీ దూరంగా ఆగిపోయాయి. రోడ్డుపై పడుకుని అటూ, ఇటూ దొర్లిన పులి.. ఆ తర్వాత తాపీగా పైకి లేచి, ఠీవీగా (Royal Walk Of Tiger) నడుస్తూ వచ్చింది. ‘‘ఎవడైనా నా ఎదురుగా వచ్చాడంటే.. యమపురికి పంపిస్తా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ నడుస్తూ రావడం అందరినీ ఆకట్టుకుంది. వాహనాలకు ఎదురుగా రాజసంగా నడుస్తూ వస్తున్న పులిలి అక్కడున్న వారంతా అలాగే చూస్తుండిపోయారు.

Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో.. బాత్రూం ఎదురుగా ఏర్పాట్లు ఎలా చేశారంటే..


ఈ అరుదైన ఘటనను ఫోటోగ్రాఫర్‌ రాయ్.. తన కెమెరాలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి రాజసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పులి నడక ఎంతో అందంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 4.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ముద్దుకు ముద్దు బదులిచ్చేసిందిగా.. ఈ పాము చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 10:44 AM