ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మానవత్వం మంటగలిసిన వేళ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను.. కాపాడాల్సింది పోయి..

ABN, Publish Date - Jan 04 , 2025 | 07:28 PM

‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్న వాడు’’.. అని ఓ కవి అన్నట్లుగా.. రోజు రోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి కాపాడాల్సింది పోయి.. మరిన్ని కష్టాలు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఎదురుగా మనుషుల ప్రాణాలు పోతున్నా వేడుక చూసే వారే తప్ప వెళ్లి కాపాడే వారు కనిపించని పరిస్థితి. ఇలాంటి ..

‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్న వాడు’’.. అని ఓ కవి అన్నట్లుగా.. రోజు రోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి కాపాడాల్సింది పోయి.. మరిన్ని కష్టాలు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఎదురుగా మనుషుల ప్రాణాలు పోతున్నా వేడుక చూసే వారే తప్ప వెళ్లి కాపాడే వారు కనిపించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టేలా మన కళ్లముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రమాదానికి గురైన ట్రక్కు లోపల డ్రైవర్ ఇరుక్కపోయాడు. ఈ సమయంలో చుట్టూ ఉన్న వారు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ (driver stuck in a truck engine) ఇంజిన్‌‌‌లో ఇరుక్కుపోయాడు. బయటికి రాలేక, తీవ్ర గాయాలతో కేకలు వేస్తున్నాడు. ప్రమాదాన్ని గమనించిన చాలా మంది ట్రక్కు వద్దకు వచ్చారు. అయితే వారిలో ఎవరూ డ్రైవర్‌ను బయటికి తీసే ప్రయత్నం చేయలేదు. పైగా ఇంజిన్‌ ముందు వైపు పడిపోయిన డ్రైవర్ పర్సు, ఫోన్లు తదితర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

Viral Video: వీడెవడండీ బాబూ.. వేదికపైనే వధువును ముద్దు అడిగేయడంతో.. చివరకు..


‘‘కాపాడండి.. కాపాడండి’’.. అని డ్రైవర్ అరుస్తున్నా కూడా వారెవరూ అతడి గోడును వినిపించుకోలేదు. కింద పడిపోయిన వస్తువులను ఎత్తుకెళ్లేవారే తప్ప అతడిని కాపాడటానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ డ్రైవర్ నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోయాడు. అయితే ఈ ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ హృదయవిదారక ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: వికలాంగుడు రైలు ఎక్కాలని చూడగా తెరుచుకోని డోర్లు.. చివరకు అతడి నిర్వాకంతో..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదు’’... అంటూ కొందరు, ‘‘ఛీఛీ సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారా.. అతడిని కాపాడే ప్రయత్నం చేయకుండా వస్తువులు ఎత్తుకెళ్లడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2025 | 07:28 PM