Marriage Viral Video: ఆకతాయి పనులంటే ఇవే.. పెళ్లి ఊరేగింపులో ఇతను చేసిన పని చూస్తే.. షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:20 PM
ఓ వివాహ కార్యక్రమంలో ఊరేగింపు జరుగుతుంటుంది. చాలా మంది దారికి ఇరువైపులా రంగు రంగు దీపాలు పట్టుకుని ముందుకు కదులుతుండగా వెనుక గుర్రం బండిపై వధూవరులు కూర్చుని ఉంటారు. ఈ సందర్భంగా ఓ యువకుడు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు..

శుభకార్యాలు జరిగే సమయంలో కొన్నిసార్లు ఆకతాయిలు చేసే పనులకు అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో కొందరు ఆకతాయిలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ తాము ఇబ్బందుల్లో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ ఊరేగింపులో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఆకతాయి పనులంటే ఇవే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో ఊరేగింపు జరుగుతుంటుంది. చాలా మంది దారికి ఇరువైపులా రంగు రంగు దీపాలు పట్టుకుని ముందుకు కదులుతుండగా వెనుక గుర్రం బండిపై వధూవరులు కూర్చుని ఉంటారు. ఈ సందర్భంగా యువకులంతా డాన్సులు వేస్తూ సందడిగా గడుపుతుంటారు.
Viral Video: చుట్టూ సింహాలు.. మధ్యలో జిరాఫీ.. దాడి చేయాలని చూడగా షాక్.. చివరకు చూస్తే..
ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఊరేగింపు ముందు వైపు కొందరు గడ్డి కట్టలు వేసి నిప్పు పెడతారు. కొందరు దానిపై అటూ, ఇటూ దూకుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. గడ్డి కట్టను చేతిలోకి తీసుకుని (man danced with fire) గాల్లో తిప్పేస్తాడు. అక్కడున్న వారికి దగ్గరగా వెళ్తూ గడ్డిని అటూ, ఇటూ తిప్పుతుండడంతో అంతా భయంతో దూరంగా పారిపోతారు. ఈ క్రమంలో దీపాలు పట్టుకున్న యువకులు దూరంగా పరుగెత్తే క్రమంలో ఒకరిపై మరికొరు పడతారు. ఇలా ఆ వ్యక్తి చేసిన పనికి ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంటుంది.
ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దాన్ని ఎక్కడ మీదేస్తాడో అని పెళ్లికొడుకు భయపడుతున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘వీడేంట్రా మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 65వేలకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ బైకును చోరీ చేయడం అంత ఈజీ కాదు.. ఇతను తీసుకున్న జాగ్రత్తలు చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..