Metro Viral Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న వ్యక్తి.. సడన్‌గా మీద పడిపోయిన యువతి.. చివరకు..
ABN, Publish Date - Feb 09 , 2025 | 08:16 PM
మెట్రో రైల్లో ఓ యువకుడు కూర్చుని నిద్రపోతుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్‌లో ఆగగానే ఓ యువతి సడన్‌గా అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

మెట్రో రైళ్లలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే యువతుల వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు యువతులు రైళ్లలో ప్రయాణికుల మధ్యలో డాన్స్‌లు వేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రాంక్ వీడియోలను చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరైతే మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో నిద్రపోతున్న వ్యక్తిపై ఓ యువతి పడిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో (Metro Train) ఓ యువకుడు కూర్చుని నిద్రపోతుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్‌లో ఆగగానే ఓ యువతి సడన్‌గా అందరికీ షాక్ ఇచ్చింది. నిద్రపోతున్న వ్యక్తి వద్దకు వచ్చిన ఆమె.. అక్కడున్న ఇనుప రాడ్‌ను పట్టుకుని గాల్లోకి లేచి, ధబేల్‌మని అతడి ఒడిలో పడిపోయింది.
ఆ వెంటనే పైకి లేచి అక్కడి నుంచి పారిపోయి కిందకు దిగేసింది. యువతి ఉన్నట్టుండి తనపై పడిపోవడంతో (young woman falls on sleeping man) ఆ వ్యక్తి నొప్పితో విలవిల్లాడిపోతాడు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. పక్కన ఉన్న ఓ వ్యక్తి పైకి లేచి, ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించినా.. అప్పటికే ఆమె పారిపోయి ఉంటుంది.
Love Propose Video: కేక్ తినిపించి లవ్ ప్రపోజ్ చేశాడు.. యువతి తిరస్కరించడంతో.. చివరకు..
అయితే చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలని ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమేంటీ ఇలా షాక్ ఇచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి అద్భుతాలన్నీ మెట్రో రైళ్లలోనే జరుగుతుంటాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 32 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 09 , 2025 | 08:16 PM