ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: భయపెట్టాలని చూశారు.. చివరకు అవాక్కయ్యారు.. పడుకున్న కుక్క పక్కన టపాసు పేల్చడంతో..

ABN, Publish Date - Jan 12 , 2025 | 06:59 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది కంటెంట్ కోసం నిత్యం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వీడియోలు చేయడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుండడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్‌లు, విచిత్ర విన్యాసాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది కంటెంట్ కోసం నిత్యం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వీడియోలు చేయడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుండడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్‌లు, విచిత్ర విన్యాసాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు ఆకతాయిలు కుక్కను భయపెట్టాలని చూసి చివరకు అవాక్కయ్యారు. పడుకున్న కుక్క పక్కన టపాసు పేల్చడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఆకతాయిలు వీడియోలు చేయడం కోసం చివరకు పడుకున్న కుక్కను ఇబ్బంది పెట్టాలని చూశారు. కుక్క పక్కన టపాసులు పేల్చితే ఆ సౌండ్‌కు కుక్క భయంతో నిద్రలేచి పరుగులు పెడుతుందనేది వారి ఉద్దేశం. పడుకున్న కుక్క వద్దకు వెళ్లి.. (Youths burst firecrackers next to sleeping dog) దాని వెనుక టపాసులు పెట్టి నిప్పు అంటించారు.

Viral Video: సముద్ర స్నానం చేస్తున్న వ్యక్తి.. సడన్‌గా కాలు పట్టేసుకున్న ఆక్టోపస్.. చివరకు చూస్తే..


క్షణాల వ్యవధిలో టపాసు అయితే పేలింది కానీ.. కుక్కలో మాత్రం ఎలాంటి చలనం లేదు. సైలెంట్‌గా అలాగే పడుకుని ఉంది. దీంతో పైశాసిక ఆనందం పొందుదామనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. అప్పటిదాకా ఆతృతగా ఎదురుచూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. టపాసు పేలినా కూడా కుక్క ఎందుకు భయపడలేదబ్బా... అనుకుంటూ దగ్గరికి వెళ్తారు. పడుకున్న కుక్క అప్పుడు తాపీగా పైకి లేచి వెనక్కు చూస్తుంది. ‘‘టపాసు పేల్చితే భయపడతా అనుకున్నార్రా.. ఛాన్సే లేదు’’.. అని అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఈ చిత్రంలో దాక్కున్న చేతి గ్లౌజ్‌ను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇలా భయపెట్టాలని చూస్తే చివరకు వారందరినీ ఈ కుక్క ఫూల్స్‌ను చేసిందన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్క బాగానే తిక్క కుదిర్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘మూగజీవాలను ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 12 , 2025 | 06:59 AM