ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AB De Villiers: ఆ స్టార్లను సౌతాఫ్రికా పంపండి.. బీసీసీఐకి డివిలియర్స్ రిక్వెస్ట్..

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:26 PM

Rohit-Kohli: సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్ బోర్డుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆ భారత స్టార్లను తమ దేశానికి పంపాలని కోరాడు. ఏబీడీ ఎందుకీ విధంగా కోరాడు? అతడి మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

AB De Villiers

సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు వరల్డ్ క్రికెట్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ముఖ్యంగా భారత్‌లో అతడికి మస్తు క్రేజ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ అతడు పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ ఎన్నో స్టన్నింగ్ నాక్స్‌తో క్రికెల్ లవర్స్ మనుసులు దోచుకున్నాడు. చాలా పొదుపుగా మాట్లాడే ఏబీడీ.. అందరు ఆటగాళ్లు, జట్లతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడు. టీమిండియా స్టార్లతోనూ అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ సహా మిగతా ప్లేయర్ల గేమ్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలాంటోడు భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు. ఏబీడీ ఏం కోరాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


పర్మిషన్ ఇవ్వండి!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను సౌతాఫ్రికా పంపించాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేశాడు డివిలియర్స్. అక్కడి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టీమిండియా ప్లేయర్లు ఆడేందుకు భారత బోర్డు అనుమతించాలని కోరాడు. భారత్ నుంచి మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఒక్కడే లీగ్‌లో ఆడుతున్నాడని.. మిగతా వారికీ పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఎస్‌ఏ20లోకి డీకే రావడం అద్భుతమని.. ఇది ఆ టోర్నమెంట్‌కు గొప్ప విషయమన్నాడు. అయితే ఇక్కడితోనే ఆగకూడదని.. భవిష్యత్తులో మరింత మంది భారత ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.


అంతా బీసీసీఐ చేతుల్లోనే..

‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరింత మంది భారత ఆటగాళ్లు ఆడాలని కోరుకుంటున్నా. ఈసారి దినేష్ కార్తీక్ టోర్నీలోకి అడుగుపెట్టడం శుభపరిణామం. ఇది అద్భుతం. టోర్నీకి ఇది ఎంతగానో మంచి చేస్తుంది. ఫ్యూచర్‌లో మరింత మంది ఇండియన్ ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడతారని ఆశిస్తున్నా. బీసీసీఐ అనుమతులు ఇస్తుందని భావిస్తున్నా. భారత్‌తో పాటు ఇతర బడా దేశాల నుంచి కూడా ఆటగాళ్లు వచ్చినప్పుడు ఎస్‌ఏ 20 లీగ్ మరింత పెద్ద లీగ్‌గా రూపాంతరం చెందుతుంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కాగా, టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్ తప్ప ఏ ఇతర లీగ్‌లో ఆడకుండా బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైరైన వారికి ఈ రూల్స్ వర్తించవు.


ఇవీ చదవండి:

రోహిత్‌-కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. లాస్ట్ చాన్స్ అంటూ..

బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం

అర్ష్‌దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరాయి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 12:31 PM