Sunrisers Hyderabad: విశాఖలో సన్‌రైజర్స్ మ్యాచులు.. గట్టిగానే ప్లాన్ చేశారుగా
ABN, Publish Date - Apr 03 , 2025 | 03:15 PM
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఇక నుంచి వైజాగ్‌లో జరగనున్నాయా.. ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచుల్ని విశాఖకు తరలిస్తున్నారా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దీనికి కారణం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఓ ఆఫరే అని చెప్పాలి. ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీకి ఓ హోమ్ గ్రౌండ్ ఉంటుంది. ఆయా జట్లు ఆ మైదానాల్లో ఆడుతూ అక్కడి ఆడియెన్స్‌ను విశేషంగా అలరిస్తుంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కూ ఓ హోమ్ గ్రౌండ్ ఉంది. అదే ఉప్పల్ స్టేడియం. ఇక్కడే ఈ టీమ్ హోమ్ మ్యాచెస్ జరుగుతుంటాయి. అయితే ఇకపై ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులు మరో తెలుగు గడ్డ విశాఖలో జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కాటేరమ్మ కొడుకులు ఉప్పల్ నుంచి తమ మకాంను విశాఖకు మార్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి కారణం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఆఫరే. మరి.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏసీఏ ఇచ్చిన ఆఫర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
ఎస్ అంటే చాలు..
సన్‌రైజర్స్‌కు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. పన్ను మినహాయింపులతో పాటు ఇతర సహకారం కూడా అందిస్తామని ఎస్‌ఆర్‌హెచ్‌కు భరోసా ఇచ్చింది ఏసీఏ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సన్‌రైజర్స్ వివాదం నేపథ్యంలో ఏసీఏ ఆఫర్ ఇవ్వడం వైరల్‌గా మారింది. ఈ సీజన్‌లో ఇతర మ్యాచులను వైజాగ్‌లో నిర్వహించాలని ప్రతిపాదించామని ఆంధ్రా క్రికెట్ పేర్కొంది. ఆరెంజ్ ఆర్మీ నుంచి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇస్తే సీజన్‌లోని మిగిలిన సన్‌రైజర్స్ మ్యాచులు వైజాగ్‌లో నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, మ్యాచుల ఉచిత పాస్‌ల కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండటంతో సిటీని వీడి వెళ్తామని ఇటీవల సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ వార్నింగ్ ఇచ్చింది.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే భయపెడుతున్నారు
సన్‌రైజర్స్ గెలుపు దాహం తీరేనా..
కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పేసిన ధవన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 03 , 2025 | 03:20 PM