ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit-Kohli: రోహిత్‌-కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. లాస్ట్ చాన్స్ అంటూ..

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:11 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆర్నెళ్ల కింద టీ20 వరల్డ్ కప్‌ గెలవగానే వీళ్లను అందరూ ఆకాశానికెత్తేశారు. లెజెండ్స్ అంటూ ప్రశంసించారు. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబితే డెసిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోమంటూ ప్రెజర్ పెడుతున్నారు.

Rohit-Kohli

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆర్నెళ్ల కింద టీ20 వరల్డ్ కప్‌ గెలవగానే వీళ్లను అందరూ ఆకాశానికెత్తేశారు. లెజెండ్స్ అంటూ ప్రశంసించారు. పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబితే డెసిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోమంటూ ప్రెజర్ పెడుతున్నారు. టీమ్ వరుస వైఫల్యాలకు తోడు ఇద్దరూ బ్యాటింగ్‌లో దారుణంగా ఫెయిల్ అవుతుండటంతో రిటైర్ అవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో మరికొన్ని నెలల్లో భారత క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్-కోహ్లీకి భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


జట్టే ముఖ్యం!

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిలైన రోహిత్-కోహ్లీకి బీసీసీఐ గట్టిగా హెచ్చరికలు పంపిందని తెలుస్తోంది. ఎంత పెద్ద ఆటగాళ్లైనా టీమ్ తర్వాతేనని.. జట్టు అవసరాలు, గెలుపే ముఖ్యమని బోర్డు పెద్దలు స్పష్టం చేశారట. తోపు ప్లేయర్లు అయినా జట్టు తర్వాతేనని క్లారిటీ ఇచ్చారట. వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీనే చివరి అవకాశమని.. అందులో గానీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, రిజల్ట్ తారుమారైనా కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారట. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ కూడా రోకో జోడీపై సీరియస్ అయ్యాడని సమాచారం.


ఫుల్ డిస్కషన్స్

ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్-కోహ్లీ ఫెయిల్ అయ్యారు. సరిగ్గా ఆడట్లేదు, టీమ్ కూడా వరుస వైఫల్యాల్లో ఉండటంతో హిట్‌మ్యాన్‌ను ఆఖరి టెస్ట్‌లో జట్టు నుంచి తొలగించారు. దీంతో అతడికి సపోర్ట్‌గా విద్యాబాలన్, ఫర్హాన్ అక్తర్ లాంటి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, పీఆర్ క్యాంపెయినింగ్ లాంటివి జోరుగా నడవడం బీసీసీఐపై ప్రెజర్ పెట్టాయని తెలిసింది. దీంతో ఈ విషయం మీదా బోర్డు పెద్దలు గుర్రుగా ఉన్నారని వినిపిస్తోంది. త్వరలో జరిగే మీటింగ్‌లో దీనిపై మరింత డిస్కస్ చేయనున్నారని.. రోహిత్-కోహ్లీకి ఈ విషయంలోనూ వార్నింగ్స్ తప్పవని సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్.. ఇటు పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం, జట్టు ఓటములు.. మరోవైపు సోషల్ మీడియా రచ్చ.. మొత్తానికి రోకో జోడీ టైమ్ బాగోలేదని అంటున్నారు. త్వరలోనే వీళ్లు దీని నుంచి బయటపడి అదరగొట్టాలని.. చాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను విజేతగా నిలపాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.


ఇవీ చదవండి:

బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం

అర్ష్‌దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరాయి

గాయాలతో సహవాసం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 12:12 PM