Pathirana-Bravo: పతిరానా కాళ్లు మొక్కిన బ్రావో.. అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:57 AM
CSK vs KKR: కరీబియన్ వీరుడు డ్వేన్ బ్రావో ఓ బచ్చా ప్లేయర్ కాళ్లకు దండం పెట్టాడు. కోచింగ్ పోస్ట్‌లో ఉండి తన కంటే చిన్నోడి కాళ్లు మొక్కాడు. అసలు బ్రావో ఎందుకిలా చేశాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ వల్ల క్రికెట్ ప్రపంచమంతా ఓ గొడుకు కిందకు వచ్చేసింది. ఒకప్పుడు వేర్వేరు దేశాల ప్లేయర్ల మధ్య అంతగా సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి, ఫ్రెండ్‌షిప్‌కు చాన్స్ ఉండేది కాదు. దీంతో బరిలోకి దిగినప్పుడు ఒకర్నొకరు ప్రత్యర్థులుగానే చూసుకునేవారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ ఎంట్రీతో ఆటగాళ్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దేశాల హద్దులు లేకుండా పోయాయి. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలూ తగ్గిపోయాయి. తాజాగా దీనికి ఊతమిచ్చే ఓ ఘటన ఐపీఎల్‌లో చోటుచేసుకుంది. ఒక వెటరన్ ప్లేయర్.. ఓ బచ్చా బౌలర్ కాళ్లు మొక్కాడు. అతడు ఎందుకిలా చేశాడంటే..
నువ్వు ఆడకపోతే చాలు..
చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఇందులో కేకేఆర్ 8 వికెట్ల భారీ తేడాతో నెగ్గింది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎస్‌కే స్పీడ్‌స్టర్ మతీష పతిరానాను కలిశాడు కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో. చెన్నైకి మాజీ బౌలింగ్ కోచ్ అయిన బ్రావో.. ఈసారి టీమ్ మారడంతో పతిరానాను ఆటపట్టించాడు. అతడ్ని సమీపించగానే కాళ్ల మీద పడ్డాడు. బేబీ గోట్ అంటూ మెచ్చుకున్నాడు. దీంతో షాకైన పతిరానా వెంటనే కోలుకొని అతడికి తిరిగి దండం పెట్టాడు. ఆ తర్వాత తనకు ఏదైనా సజెషన్ ఇవ్వమని కోరగా.. రేపటి మ్యాచ్‌లో నువ్వు ఆడకపోతే అదే చాలు అంటూ జోక్స్‌తో నవ్వుల్లో మునిగేలా చేశాడు బ్రావో. దీంతో పతిరానా నవ్వాపుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ వీడియో నెట్టింట వైరల్ అవడం స్టార్ట్ అయింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో పతిరానాను టీమ్‌లోకి తీసుకోలేదు ధోని.
ఇవీ చదవండి:
చెపాక్‌లో తలెత్తుకోకుండా చేశారు
ధోని ఔట్ కాలేదా.. తప్పు ఎవరిది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి