Champions Trophy Semi Final: ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్.. ఒక్క మాట అన్నా ఊరుకోనంటూ..
ABN , Publish Date - Mar 05 , 2025 | 09:34 AM
India vs Australia Highlights: భారత్-ఆస్ట్రేలియా పోరాటం అనుకున్నట్లే ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే చివరి వరకు ఆధిపత్యం చలాయించిన టీమిండియా విక్టరీ కొట్టింది.

చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లోకి దర్జాగా ఎంట్రీ ఇచ్చింది టీమిండియా. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. ప్రత్యర్థి సంధించిన 264 పరుగుల టార్గెట్‌ను మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది రోహిత్ సేన. ఈ విక్టరీతో చాంపియన్స్ ట్రోఫీ కప్పుకు మరో అడుగు దూరంలో నిలిచింది మెన్ ఇన్ బ్లూ. భారత్ విజయంతో అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. మరో ఐసీసీ కప్ లోడింగ్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు కూడా ఒకర్నొకరు హగ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ తరుణంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..
ఏం అడ్వాంటేజో చెప్పాలి..
భారత మ్యాచులన్నీ దుబాయ్‌లో నిర్వహించడం వల్ల రోహిత్ సేనకు అదనపు ప్రయోజనం కలుగుతోందంటూ ఇతర దేశాల మాజీ క్రికెటర్లు, క్రిటిక్స్ చేస్తున్న విమర్శలపై గంభీర్ సీరియస్ అయ్యాడు. ఇంకా ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదన్నాడు. ‘మాకేం అడ్వాంటేజ్ దొరికిందో చెప్పాలి. ఐసీసీ అకాడమీలో మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. స్టేడియానికి ప్రాక్టీస్ సెషన్స్‌కు మధ్య పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మాకేదో అదనపు ప్రయోజనం కలుగుతోందని కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు ఇంకా మెచ్యూర్ అవ్వాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. తాము ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడి కాంబినేషన్స్‌ను సెట్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశాడు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ తమ ప్రయాణం సాగుతోందన్నాడు. ఎవరో ఏదో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పట్టించుకోమన్నాడు.
ఇవీ చదవండి:
ఇక కంగారు పోయింది టైటిల్ మిగిలింది
డ్రెస్సింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి