ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hardik-Axar: హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది

ABN, Publish Date - Jan 12 , 2025 | 11:54 AM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోమారు అన్యాయం జరిగింది. అతడ్ని కాదని స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అయితే ఇందులో బోర్డు తప్పేమీ లేదు.

Hardik vs Axar

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి అడుగుపెట్టిన ప్రతిసారి 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు. గత కొన్నేళ్లుగా భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాడు. పోయినేడు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో అతడి రోల్ ఎంతనేది స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బ్యాటర్‌, బౌలర్, ఫీల్డర్‌గా అతడు సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే జట్టు కోసం ఇంత చేస్తున్నా హార్దిక్‌ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కడం లేదు. అతడి విషయంలో భారత క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. పాండ్యాకు మరోమారు మొండిచెయ్యి చూపింది బీసీసీఐ. అతడికి బదులు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చింది.


హార్దిక్‌ను కాదని..!

ఇంగ్లండ్‌తో త్వరలో జరిగే టీ20 సిరీస్ కోసం టీమ్‌ను ప్రకటించారు భారత సెలెక్టర్లు. 15 మందితో కూడిన ఈ జట్టును సారథి సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనున్నాడు. అయితే టీమ్ అనౌన్స్‌మెంట్‌లో ఓ సర్‌ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చారు. ఈ టీమ్‌కు అతడ్ని వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీమ్‌లోనే ఉన్న సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మాత్రం మొండిచెయ్యి చూపారు. దీంతో పాండ్యాకు అన్యాయం జరిగిందని కొందరు అంటున్నారు. అప్పట్లో టీ20 వరల్డ్ కప్‌-2024 ముగింపు తర్వాత కూడా ఇలాగే చేసి.. హార్దిక్‌ను కాదని సూర్యను సారథిని చేశారని అంటున్నారు. అయితే బీసీసీఐ తప్పు చేసిందనే విమర్శలు వస్తున్నా.. బోర్డు చేసిన పని కరెక్ట్ అని ఒప్పుకోక తప్పదు.


గాయాలతో సావాసం!

బుమ్రాలాగే హార్దిక్ కూడా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తుంటాడు. దీంతో కొన్ని నెలల పాటు టీమ్‌కు దూరమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. బీసీసీఐ, భారత టీమ్ మేనేజ్‌మెంట్ తమకు పర్మినెంట్ కెప్టెన్ కావాలని అనుకుంటున్నాయి. అందుకే అప్పట్లో హార్దిక్‌ను కాదని సూర్యను ఎంచుకున్నాయి. ఇప్పుడు కూడా అతడ్ని కాదని.. టీ20ల్లో వరుసగా పార్టిసిపేట్ చేస్తూ వికెట్లు తీస్తూ, విలువైన పరుగులు చేస్తున్న అక్షర్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారని తెలుస్తోంది. అందునా పొట్టి ప్రపంచ కప్ మొత్తం అక్షర్ అద్భుతంగా ఆడాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ నాక్‌తో మెరిశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హార్దిక్‌ను కాదని అక్షర్‌ను వైస్ కెప్టెన్‌ చేయాలని బోర్డు పెద్దలు భావించినట్లు సమాచారం.


ఇవీ చదవండి:

చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..

షమి వచ్చేశాడు

‘మెల్‌బోర్న్‌’తోనే గుడ్‌ బై చెబుదామనుకున్నాడా!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2025 | 11:59 AM