Share News

IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:28 PM

Team India: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైవిధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకుంది. పక్కా టీమ్‌లో ఉంటారని భావించిన ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు.

IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్
Team India

చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ వైవిధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో వెళ్లడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా టీమ్‌లో ఉండటం కామనే. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ బాధ్యతలు చూసుకోవడం ఊహించిందే. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎంపిక కూడా గెస్ చేసినవే. కానీ చివరి ముగ్గురు ఆటగాళ్ల ఎంపికలో టీమ్ మేనేజ్‌మెంట్ ట్విస్ట్ ఇచ్చింది.


చివరి క్షణంలో ట్విస్ట్!

భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అనూహ్యంగా యంగ్ పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో చాన్నాళ్లుగా రాణిస్తూ వస్తున్న లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులో తప్పక ఉంటాడని అంతా భావించారు. ఎడమచేతి వాటం పేసర్ కాబట్టి కూర్పులో వైవిధ్యం ఉంటుందని అనుకున్నారు. కానీ అతడ్ని కాదని యువ బౌలర్ రాణాను తీసుకున్నారు. రాణా వస్తే షమి ఉండడని అనుకుంటే అతడికి కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించింది టీమ్ మేనేజ్‌మెంట్. ప్రధాన స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం పక్కా అని వార్తలు వచ్చాయి. అయితే సారథి రోహిత్‌ బాగా నమ్మే కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా ఒక స్పిన్నర్, ఇద్దరు పేసర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు, ఐదురుగు బ్యాటర్లతో కాస్త ప్రత్యేకమైన కూర్పుతోనే బరిలోకి దిగింది భారత్. ఈ లైనప్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


ఇవీ చదవండి:

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కోలుకోలేని షాక్

దిగొచ్చిన పాక్‌.. స్టేడియంలో భారత జెండా

గిల్‌ @:1 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 02:33 PM