IPL Robot Dog: ఐపీఎల్‌లో కొత్త టెక్నాలజీ.. వెంటపడి మరీ భయపెడుతోంది
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:17 PM
Indian Premier League: క్రికెట్‌లో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్‌లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఒకప్పటితో పోలిస్తే సాంకేతిక రంగం ఇప్పుడు ఊహించని రీతిలో శరవేగంగా పరుగులు పెడుతోంది. టెక్నాలజీలో చాలా వేగంగా మార్పులు వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రివల్యూషన్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఇలా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను, నయా టెక్నాలజీలను ఇతర రంగాలు అవసరం మేర వాడుకుంటున్నాయి. క్రికెట్‌లో కూడా టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిపోయంది. భారత క్రికెట్ బోర్డు అయితే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చాలా ముందుంటుంది. మరోసారి ఇది ప్రూవ్ అయింది. ప్రతిష్టాత్మక ఐపీఎల్‌లో ఓ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇది మామూలు డాగ్ కాదు
ఐపీఎల్ నయా ఎడిషన్‌లో రోబోటిక్ డాగ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది బీసీసీఐ. చూడటానికి కుక్క ఆకారంలో ఉండే ఈ రోబోకు హైక్వాలిటీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఆటలోని వైవిధ్యమైన విషయాలను ప్రెజెంట్ చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇస్తోందీ కెమెరా. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న గ్రౌండ్‌లోకి వచ్చిన రోబో డాగ్.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాకు హ్యాండ్ షేక్ ఇచ్చింది. ఇంకొందరి ఆటగాళ్ల వెంటపడి వాళ్లను భయపెట్టింది. నడుస్తూ, పరిగెడుతూ, పల్టీలు కొడుతూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందీ రోబో. ఆటగాళ్లకు చేరువగా వెళ్లి వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసేతీరును దగ్గర్నుంచి రికార్డ్ చేసి.. ఆ వీడియోలను అభిమానులకు అందించింది. ఇది చూసిన నెటజిన్స్.. తస్సాదియ్యా ఏం టెక్నాలజీ భయ్యా.. అదిరిపోయిందని అంటున్నారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదని.. బీసీసీఐ అంటే మాటలా అని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ వర్సెస్ ముంబై.. లెక్కలు మారుస్తారా..
ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి