Kane Williamson: తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..

ABN, Publish Date - Feb 06 , 2025 | 01:58 PM

IPL 2025: న్యూజిలాండ్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌కు స్వదేశంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. అంతేస్థాయిలో భారత్‌లో ఆదరణ ఉంది. ఐపీఎల్‌తో అతడి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది.

Kane Williamson: తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..
Kane Williamson

క్రికెట్‌ను మతంలా చూసే మన దేశంలో టీమిండియా ప్లేయర్లనే కాదు.. బాగా పెర్ఫార్మ్ చేసే ఇతర దేశ ఆటగాళ్లకూ భారీ స్థాయిలో ఆదరణ ఉంటుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న విదేశీ క్రికెరట్లలో ముందు వరుసలో ఉంటాడు న్యూజిలాండ్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. ఎంత బిగ్ మ్యాచ్, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అతడు కూల్‌గా ఉంటాడు. సొంత జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థులతోనూ అంతే గౌరవంగా ఉంటాడు. ఓడినా అతడి ముఖం మీద చిరునవ్వు చెరగదు. అందుకే విలియమ్సన్‌ను ఇండియా ఫ్యాన్స్ తమ సొంతోడిలా భావిస్తారు. ఐపీఎల్‌ ద్వారా ఇక్కడి వారికి అతడు మరింత చేరువయ్యాడు. అతడ్ని ప్రేమతో కేన్ మామ అని పిలుస్తుంటారు అభిమానులు. ఈ పిలుపుపై విలియమ్సన్ రియాక్ట్ అయ్యాడు.


ఆ పేరుతోనే పిలుస్తారు!

తెలుగోళ్ల ప్రేమకు తాను ఫిదా అయిపోయానని విలియమ్సన్ అన్నాడు. కేన్ మామ అనే పిలుపు తనకు ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్‌ఏ20 లీగ్‌లో ఆడుతున్నాడు విలియమ్సన్. ఈ నేపథ్యంలో సరదాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ‘భారత్‌లో నీకు ఉన్న నిక్‌నేమ్ ఏంటి?’ అని ప్రశ్నించాడు సహచర ఆటగాడు హెన్రిక్ క్లాసెన్. దీనికి విలియమ్సన్ స్పందిస్తూ.. ‘అక్కడ అంతా నన్ను కేన్ మామ అని పిలుస్తారు. ఈ మాటకు అర్థం తెలుసుకునేందుకు నాకు చాలా టైమ్ పట్టింది. కానీ నన్ను అలా పిలవడం ఫ్యాన్స్‌కు ఇష్టం’ అని కివీస్ స్టార్ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో కూడా అంతా ఇలాగే పిలుస్తారని రివీల్ చేశాడు. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు చాన్నాళ్ల పాటు ఆడాడు విలియమ్సన్. అతడి ఆటకు ఫిదా అయిన తెలుగోళ్లు కేన్ మామ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. క్రమంగా ఆ పేరు వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి అతడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినా గ్రౌండ్‌లో, సోషల్ మీడియాలో భారత అభిమానులు కేన్ మామ అని పిలవడం అలవాటైంది.


ఇవీ చదవండి:

కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. ఈ ఇన్నింగ్స్‌ గుర్తుందా

‘చాంపియన్స్‌’కు ముందు భలే చాన్స్‌!

త్రిషకు రూ. కోటి నజరానా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 01:59 PM