Rohit Sharma IPL 2025: రోహిత్ సిక్స్‌కు దద్దరిల్లిన స్టేడియం.. చెవులు పగిలేంత సౌండ్

ABN, Publish Date - Apr 01 , 2025 | 10:55 AM

Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క సిక్స్‌తో అందరికీ గూస్‌బంప్స్ తెప్పించాడు. అతడి షాట్ దెబ్బకు స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది.

Rohit Sharma IPL 2025: రోహిత్ సిక్స్‌కు దద్దరిల్లిన స్టేడియం.. చెవులు పగిలేంత సౌండ్
Rohit Sharma

బాహుబలి 2.. పాన్ ఇండియా సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తావన వస్తే ఒక్కసారిగా చాలా సీన్లు గుర్తుకొస్తాయి. అయితే అన్నింటికంటే ఆ మూవీ ఇంటర్వెల్ సీన్ మాత్రం అందరికీ బాగా రిజిస్టర్ అయింది. పట్టాభిషేకం సీన్‌లో రెబల్‌స్టార్ ప్రభాస్‌ నటన, ఆ టైమ్‌లో బాహుబలి జయహో.. అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మార్మోగడం ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. సరిగ్గా ఇలాంటి సీనే ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో నిన్న రిపీట్ అయింది. ఒక్క సిక్స్‌తో వాంఖడే స్టేడియం దద్దరిల్లేలా చేశాడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఒక్క సిక్స్‌తో..

ఐపీఎల్ నయా ఎడిషన్‌లో వరుసగా విఫలమవుతున్నాడు రోహిత్. అతడి ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ముంబై టీమ్ మీదా పడుతోంది. అందుకే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది ఎంఐ. దీంతో మూడో మ్యాచ్‌లోనైనా అతడు చెలరేగాలని అభిమానులు కోరుకున్నారు. అయితే నిన్న కేకేఆర్‌తో జరిగిన పోరులో అతడు 13 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. హిట్‌మ్యాన్ భారీ స్కోరు చేయకపోయినా అతడి టీమ్ నెగ్గింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అతడు ఆరంభంలో కొట్టిన ఓ సిక్స్‌తో వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. అతడి బ్యాట్ నుంచి ఈ సీజన్‌లో వచ్చిన ఈ తొలి సిక్స్‌ దెబ్బకు అభిమానులు లేచి ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. రోహిత్.. రోహిత్.. అంటూ గట్టిగా అరిచారు. ఆ టైమ్‌లో సౌండ్ మీటర్‌ను చెక్ చేయగా.. శబ్దం 129 డెసిబల్స్‌గా నమోదైంది. ఇంత సౌండ్ తరచూ వింటే చెవులు పాడవ్వాల్సిందే. అలా ఒక్క సిక్స్‌తో నిన్న స్టేడియాన్ని షేక్ చేశాడు రోహిత్.


ఇదీ చదవండి:

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్

పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా

పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్‌?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం చదవండి

Updated Date - Apr 01 , 2025 | 01:25 PM