LSG vs MI Playing 11: లక్నో-ముంబై ఫైట్.. ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు
ABN, Publish Date - Apr 04 , 2025 | 04:43 PM
Today IPL Match: ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్లలో ముంబై ఒకటి. కానీ ఆ జట్టుకు ఒక టీమ్ మీద మాత్రం చెత్త రికార్డు ఉంది. అదే లక్నో సూపర్ జియాంట్స్. అందర్నీ మడతబెట్టే ఎంఐ.. లక్నో పేరు చెబితే మాత్రం భయపడుతుంది.

ముంబై ఇండియన్స్.. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టు. తోపు టీమ్స్‌ను కూడా భయపెట్టించిన రికార్డు ఎంఐది. కానీ లక్నో సూపర్ జియాంట్స్ పేరు చెబితే చాలు.. ముంబై వణుకుతుంది. దీనికి కారణం ఆ టీమ్‌కు ఉన్న రికార్డులే. లక్నో చేతిలో పలుమార్లు దారుణ పరాభవాలు చవిచూసింది ముంబై. గత సీజన్‌లో అయితే తలపడిన రెండుసార్లూ ఎల్‌ఎస్‌జీదే విజయం. దీన్ని బట్టే లక్నో డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎల్‌ఎస్‌జీని ఆపేందుకు ఉరిమే ఉత్సాహంతో సిద్ధమవుతోంది ఎంఐ. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జరిగే ఈ పోరులో ఏ జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
సేమ్ కాంబో
ముంబై గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించినందున అదే టీమ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తోంది. అదే జరిగితే.. రోహిత్ శర్మ-ర్యాన్ రికల్టన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్, సెకండ్ డౌన్‌లో తిలక్ వర్మ ఆడటం ఖాయం. హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు. మిచెల్ శాంట్నర్, విఘ్నేష్ పుతుర్ స్పెషలిస్ట్ స్పిన్నర్స్‌గా దిగడం పక్కా. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ పేస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు.
పేస్ యోధుడు వస్తున్నాడు
లక్నో జట్టులో ఒక మార్పు ఖాయంగా కనిస్తోంది. ఫిట్‌నెస్ సాధించిన ఆకాశ్‌దీప్ తిరిగి జట్టుతో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా మార్క్రమ్, మార్ష్ దిగడం పక్కా. పూరన్ ఫస్ట్ డౌన్‌లో, పంత్ సెకండ్ డౌన్‌లో ఆడతారు. బదోని, మిల్లర్, సమద్ ఫినిషింగ్ బాధ్యతలు చూసుకుంటారు. లార్డ్ శార్దూల్, ఆకాశ్ పేస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. బిష్ణోయ్, దిగ్వేష్ స్పిన్ బాధ్యతలు షేర్ చేసుకుంటారు.
ప్లేయింగ్ ఎలెవన్:
ముంబై (అంచనా)
రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుతుర్.
ఇంపాక్ట్ ప్లేయర్: ముజీబుర్ రెహ్మాన్
లక్నో (అంచనా)
ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్-కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ రాఠీ, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్: ఎం సిద్ధార్థ్
ఇవీ చదవండి:
రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
ముంబైపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2025 | 05:19 PM