Share News

MI vs DC: నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. నాయర్ ఇంత మాట అనేశాడేంటి

ABN , Publish Date - Apr 14 , 2025 | 02:35 PM

Today IPL Match: సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో తన రీఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు.

MI vs DC: నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. నాయర్ ఇంత మాట అనేశాడేంటి
Karun Nair

ప్రొఫెషనల్ క్రికెట్‌లో అవకాశాలు రావడం చాలా తక్కువ. అయితే వచ్చిన అరకొర చాన్సుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ గానీ మిస్ చేసుకుంటే మాత్రం మళ్లీ అదృష్టం తలుపు తడుతుందనే గ్యారెంటీ లేదు. అయితే కొందరు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమను తాము సానబెట్టుకుంటూ ముందుకెళ్తుంటారు. చాన్స్ దొరికినప్పుడు కుమ్మేస్తారు. ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఏళ్లుగా సరైన సమయం, అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్టైలిష్ బ్యాటర్ కరుణ్ నాయర్ అదరగొట్టాడు. తనలో దాగి ఉన్న కోపం, బాధను అణచుకుంటూ భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సులతో రచ్చ రచ్చ చేశాడు. అలాంటోడు మ్యాచ్ తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడేం అన్నాడంటే..


విలువ ఉండదు

ముంబైతో మ్యాచ్‌లో డీసీ తరఫున బరిలోకి దిగిన నాయర్.. స్టన్నింగ్ నాక్‌తో మెస్మరైజ్ చేశాడు. 7 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో అర్ధ శతకం బాదాడు. అయితే అతడు అంత ప్రయత్నించినా డీసీ విజయ తీరాలకు చేరుకోలేకపోయింది. 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో తన ఇన్నింగ్స్‌కు విలువ లేదన్నాడు నాయర్. టీమ్ నెగ్గనప్పుడు వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు చేశామన్నది లెక్కలోకి రాదని.. ఆ ఇన్నింగ్స్ వృథా అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు.


ఆ షాట్లే ఆడా

జట్టు గెలవనప్పుడు ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడినా ప్రయోజనం లేదన్నాడు కరుణ్ నాయర్. బాగానే బ్యాటింగ్ చేశానని, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం బాధించిందన్నాడు. టీమ్ ఓడినప్పుడు ఆ ఇన్నింగ్స్‌కు వ్యాల్యూ ఉండదన్నాడు నాయర్. మంచి చాన్స్ వస్తే ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూశానని.. క్రీజులోకి వెళ్లాక బెస్ట్ గేమ్ బయటకు తీయాలని భావించానన్నాడు స్టైలిష్ బ్యాటర్. తాను మామూలుగా ఆడే షాట్లే బాదానని, అవే తనకు కలిసొచ్చాయని నాయర్ చెప్పుకొచ్చాడు. టీమ్ విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేదని అతడు పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

రోహిత్ మాటతో రిజల్ట్ తారుమారు

యూపీఐకి ఐపీఎల్ బెట్టింగ్ ఫీవర్

బుమ్రాతో ఆడుకున్న ఢిల్లీ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 02:38 PM