IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి రాక్షసుడి రీఎంట్రీ
ABN, Publish Date - Jan 24 , 2025 | 05:48 PM
India Playing 11: తొలి టీ20లో ఇంగ్లండ్ బెండు తీసిన భారత్.. రెండో మ్యాచ్ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే ఈ టీ20లోనూ మరోమారు బట్లర్ సేనను చిత్తు చేయాలని చూస్తోంది.

భారత జట్టు బౌలింగ్ భారాన్ని ఏళ్లుగా భుజాలపై మోస్తున్న బౌలర్. బరిలోకి దిగితే ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేసే పేస్ పిచ్చోడతను. అవతలి జట్టు మీద రాక్షసుడిలా పడి రిజల్ట్‌ను తారుమారు చేయగల సిద్ధహస్తుడు. బుల్లెట్ పేస్, మాయ చేసే స్వింగ్, గురి తప్పని లైన్ అండ్ లెంగ్త్‌తో అపోజిషన్ టీమ్‌ను షేక్ చేసే ఆ పేస్ యోధుడు గాయం కారణంగా కొన్నాళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. అలాంటోడు రికవరీ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇంగ్లండ్‌కు దబిడిదిబిడి ఖాయం.
యుద్ధానికి సిద్ధం!
ఏస్ పేసర్ మహ్మద్ షమి కమ్‌బ్యాక్ కోసం రెడీ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 తర్వాత గాయం కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు షమి. దాదాపుగా రెండేళ్లు టీమ్‌కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం భారత జట్టుతో జాయిన్ అయ్యాడు. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడ్ని ఆడించలేదు. దీంతో అతడు ఇంకా కోలుకోలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే షమి ఫుల్ ఫిట్‌గా ఉన్నాడని.. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే రెండో టీ20లో అతడు బరిలోకి దిగడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఆడిస్తారా? హ్యాండ్ ఇస్తారా?
చెపాక్‌లో ఇతర భారత ఆటగాళ్లతో కలసి షమి ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహచరులతో కలసి రన్నింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన ఏస్ పేసర్.. ఆ తర్వాత పలు ఓవర్లు బౌలింగ్ చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతూ కనిపించాడు. కంటిన్యూస్‌గా స్పెల్స్ వేశాడు. దీంతో గంభీర్ అతడ్ని పక్కాగా సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. రెండో టీ20లో ఇంగ్లండ్‌పై పేస్ పిచ్చోడు రెచ్చిపోవడం ఖాయమని వినిపిస్తోంది. అయితే స్పిన్‌కు అనుకూలించే చెపాక్ వికెట్ మీద తొలి మ్యాచ్‌లో రాణించిన అర్ష్‌దీప్‌ను కాదని షమీకి చోటు ఇస్తారా? లేదా ఇతర స్పిన్నర్‌ను తీసేసి అతడ్ని జట్టులోకి తీసుకుంటారా? అనేది చూడాలి. షమీని ఇప్పుడైనా ఆడిస్తారా? లేదా మొదటి టీ20 మాదిరిగా హ్యాండ్ ఇస్తారా? అని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 24 , 2025 | 06:41 PM