Noman Ali: క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:20 PM
Noman Ali Breaks All Time Record: క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. 73 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఓ స్పిన్నర్ బద్దలు కొట్టాడు. ఏంటా రికార్డు? ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఎంతటి గ్రేట్ రికార్డ్ అయినా ఏదో ఒక రోజు బ్రేక్ అవ్వాల్సిందే. కొందరు ఆటగాళ్లు అసమాన ప్రతిభతో చెక్కు చెదరకుండా ఉన్న ఎన్నో పాత రికార్డులకు పాతర వేశారు. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికేనని నిరూపించారు. ఇప్పుడో ఆటగాడు అలాంటి ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేసి వారెవ్వా అనిపించాడు. 73 ఏళ్లుగా అన్‌బ్రేకబుల్‌గా ఉన్న రికార్డును బద్దలుకొట్టి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. మరి.. ఏంటా అరుదైన రికార్డు? దాన్ని బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
వాటే ఫీట్!
పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ స్పిన్నర్ హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. హ్యాట్రిక్ తీసిన తొలి పాకిస్థాన్ బౌలర్‌గా అతడు రికార్డుల్లోకి ఎక్కాడు. 1952లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ టీమ్ తరపున ఒక్క స్పిన్నర్ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీయలేదు. 73 ఏళ్ల పాక్ టెస్ట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక స్పిన్ బౌలర్‌గా అతడు ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. విండీస్‌తో మ్యాచ్‌లో వరుసగా 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్, కెవిన్ సింక్లెయిర్ వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు నోమన్ అలీ.
విండీస్ వదల్లేదు!
ముల్తాన్ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 41.1 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. హ్యాట్రిక్ హీరో నోమన్ అలీ (6/41)తో పాటు సాజిద్ ఖాన్ (2/64) పర్యాటక జట్టు నడ్డి విరిచారు. కాశిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్‌తో వారిద్దరికీ మంచి సహకారం అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టు 154 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్ గుడకేష్ మోతీ (3/49)తో పాటు పేసర్లు జోమెల్ వారికన్ (4/43), కీమర్ రోచ్ (2/15) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను కట్టడి చేశారు. పాక్‌కు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ఇవీ చదవండి:
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
ఆర్సీబీపై కుల్దీప్ సెటైర్.. అంత మాట అనేశాడేంటి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి