ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pant-Jaiswal: పంత్-జైస్వాల్ మధ్య వార్.. అగ్గిరాజేసింది బీసీసీఐనే..

ABN, Publish Date - Jan 13 , 2025 | 08:59 AM

భారత జట్టులో మంచి దోస్తులుగా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌ను చెప్పొచ్చు. క్రీజులో అడుగు పెట్టింది మొదలు అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టే ఈ లెఫ్టార్మ్ బ్యాటర్లు.. ఫ్రెండ్‌షిప్‌కు చాలా విలువ ఇస్తారు.

Team India

భారత క్రికెట్ ఇప్పుడు సంధి దశలో ఉంది. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత నుంచి టీమిండియాలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి కెప్టెన్సీ వరకు అనేక చేంజెస్ జరుగుతున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్-కోహ్లీ వన్డేలు, టెస్టుల్లో ఎన్నాళ్లు కొనసాగుతారనేది కొంత క్లారిటీ వస్తుంది. దీంతో వన్డే, టీ20కి రెగ్యులర్ కెప్టెన్, వైస్ కెప్టెన్‌ పోస్టులను భర్తీ చేయడంపై భారత క్రికెట్ బోర్డు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇద్దరు దోస్తుల మధ్య ఇన్‌డైరెక్ట్‌గా అగ్గిరాజేసింది. ఆ ఫ్రెండ్స్ మరెవరో కాదు.. రిషబ్ పంత్-యశస్వి జైస్వాల్.


బీసీసీఐ మల్లగుల్లాలు!

భారత జట్టులో మంచి స్నేహితులుగా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌ను చెప్పొచ్చు. క్రీజులో అడుగు పెట్టింది మొదలు అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టే ఈ లెఫ్టార్మ్ బ్యాటర్లు.. ఫ్రెండ్‌షిప్‌కు చాలా విలువ ఇస్తారు. మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు ఇప్పుడో విషయంలో తలపడుతున్నారు. అదే వైస్ కెప్టెన్సీ. భారత టెస్ట్ టీమ్‌కు రెగ్యులర్ వైస్ కెప్టెన్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. లాంగ్ ఫార్మాట్‌లో సారథ్యంలో రోహిత్‌కు వారసుడిగా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను నియమించాలని చూస్తోంది. అతడికి డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా పంత్-జైస్వాల్‌లో ఒకర్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారట బోర్డు పెద్దలు.


ఎవరు బెస్ట్?

కెరీర్ ఆరంభం నుంచి టెస్టుల్లో పంత్ అదరగొడుతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కమ్‌బ్యాక్‌లో మునుపటి స్థాయిలో కాకపోయినా బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అటు జైస్వాల్ స్టన్నింగ్ నాక్స్‌తో ఓపెనర్‌గా మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. గతేడాది భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది అతడే. ఇలా వీరిద్దరూ టీమ్‌లో పర్మినెంట్ బెర్త్ ఖరారు చేసుకోవడం, లాంగ్ ఫార్మాట్‌లో కీలక ప్లేయర్లుగా ఎదగడంతో వైస్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. వీళ్లలో ఒకరికి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. జైస్వాల్ యంగ్‌స్టర్ కావడం, కాస్త తక్కువ అనుభవం ఉండటం, దూకుడు కలిగిన ప్లేయర్ అవడంతో అతడి కంటే పంత్‌ వైపే బోర్డు పెద్దలు మొగ్గుచూపుతున్నారట. అయితే దీనిపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. ఏదేమైనా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ చెప్పలేం.


ఇవీ చదవండి:

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌

గ్రామీణ క్రీడకు అంతర్జాతీయ సొబగు

14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ.. ఈ అమ్మాయి బ్యాటింగ్‌కు ఫిదా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 09:43 AM