ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rishabh Pant: సింగిల్ కష్టమైన చోట సిక్సుల వర్షం.. పంత్ మాస్ బ్యాటింగ్

ABN, Publish Date - Jan 04 , 2025 | 02:17 PM

IND vs AUS: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు. కనికరం లేకుండా కంగారూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టులను టీ20లుగా మార్చేసి.. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

Rishabh Pant

Sydney Test: సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు స్టన్నింగ్ బౌలింగ్‌తో భయపెడుతున్న మూమెంట్ అది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడతాడనుకుంటే క్రీజులో సెట్ అయ్యాక బౌల్డ్ అయ్యాడు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కూడా అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. గంపెడాశలు పెట్టుకున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 పరుగులే చేసి మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పించ్ హిట్టర్ రిషబ్ పంత్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. సింగిల్స్ తీయడమే కష్టంగా మారిన పిచ్ మీద నీళ్లు తాగినంత ఈజీగా సిక్సుల వర్షం కురిపించాడు.


ఆ షాట్లు ఏంటి బాస్!

మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూపించాడు పంత్. కంగారూ బౌలర్లను కనికరం లేకుండా శిక్షించాడు. భారీ షాట్లతో వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో టెస్టులను టీ20లుగా మార్చేశాడు. 33 బంతుల్లోనే 6 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 61 పరుగులు చేశాడు. బోలాండ్ సహా కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో అటాకింగ్‌కు దిగి.. భారీ షాట్లు బాదాడు. 184 స్ట్రైక్ రేట్‌తో ఆడాడంటేనే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బంతి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవుతున్నా పట్టించుకోకుండా తనదైన స్టైల్‌లో ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు, రివర్స్ స్వీప్స్ కొడుతూ ఆతిథ్య జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు.


లైసెన్స్ ఇవ్వడంతో..

సిడ్నీ పిచ్ మీద వికెట్ ఆపుదామని కంట్రోల్డ్‌గా, డిఫెన్సివ్‌గా ఆడితే వర్కౌట్ కావడం లేదు. బంతులు వృథా తప్ప స్కోరు బోర్డు మీదకు పరుగులు చేరడం లేదు. అలాగని షాట్లు ఆడదామంటే వికెట్లు పోతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో అతి జాగ్రత్తకు పోయి స్టార్క్, బోలాండ్ బంతులకు గాయాలపాలయ్యాడు పంత్. దీంతో ఈ అప్రోచ్ పనికిరాదని మేనేజ్‌మెంట్ అతడికి లైసెన్స్ ఇచ్చింది. తనదైన స్టైల్‌లో డిఫరెంట్ షాట్లతో విరుచుకుపడు, వికెట్లు పోయినా ఫర్వాలేదంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దీంతో ఆసీస్ బెండు తీశాడు పంత్. భారీ షాట్లతో వాళ్లను ఊచకోత కోశాడు. అతడే ఈ ఇన్నింగ్స్ ఆడకపోతే 100 లోపే భారత్ చుట్టేసేది. అతడి కారణంగా 141 వరకు వెళ్లగలిగింది. జడేజా (8 నాటౌట్), సుందర్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీళ్లు ఎంత ఎక్కువ సేపు ఆడతారనే దాని మీదే భారత్ భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉంటాయి.


ఇవీ చదవండి:

మ్యాచ్ మధ్యలో నుంచి హఠాత్తుగా బయటకు.. అసలు బుమ్రాకు ఏమైంది..

రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..

ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్.. క్రెడిట్ మొత్తం వీరికే

రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..

మరిన్ని క్రీడా వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 02:17 PM