ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్.. దేశవాళీల్లో ఇతనో లెజెండ్

ABN, Publish Date - Jan 06 , 2025 | 12:18 PM

Rishi Dhawan Retirement: ఒక టీమిండియా ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్? అనేది ఇప్పుడు చూద్దాం..

Rishi Dhawan

టీమిండియా ఆల్‌రౌండర్ రిషి ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల ఈ హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్.. వైట్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచులు ముగిశాక తన కెరీర్‌పై రిషి నిర్ణయం ప్రకటించాడు. ఆ టోర్నీ నాకౌట్స్‌కు చేరడంలో హిమాచల్ ఫెయిలైంది. దీంతో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో తనకు ఎలాంటి రీగ్రెట్స్ లేవని.. ఇన్నాళ్లు ఆడినందుకు సంతోషంగా ఉన్నానని అన్నాడు. బరువైన హృదయంతో ఆటకు వీడ్కోలు చెబుతున్నానని చెప్పాడు. గత 20 ఏళ్లుగా క్రికెట్‌ తనకు సర్వస్వంగా మారిందని.. తన జీవితాన్ని ఈ గేమ్ నిర్వచించిందన్నాడు.


క్రికెట్‌ను మర్చిపోను!

క్రికెట్‌ తనకు ఎంతో నేర్పించిందని.. అనేక మధుర జ్ఞాపకాలు మిగిల్చిందన్నాడు రిషి ధావన్. జెంటిల్మన్ గేమ్ తన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా, 2016లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడీ ఆల్‌రౌండర్. నాలుగు సార్లు టీమిండియా తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వన్డేలతో పాటు టీ20ల్లోనూ ఆడే చాన్స్ సొంతం చేసుకున్నాడు. కానీ అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోవడంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. అయితే టీమిండియా తరఫున గొప్పగా ఆడలేకపోయినా.. డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం లెజెండ్‌గా గుర్తింపు సంపాదించాడు రిషి.


సూపర్ రికార్డులు..

టీమిండియా తరఫున 3 వన్డేలు ఆడి 12 పరుగులు చేసిన రిషి ధావన్.. 1 వికెట్ పడగొట్టాడు. అదే టీ20ల్లో ఒక పరుగు చేసి, 1 వికెట్ తీశాడు. అతడి దేశవాళీ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 98 మ్యాచుల్లో 4824 పరుగులు చేశాడు రిషి. ఇందులో 6 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 353 వికెట్లు పడగొట్టాడీ ఆల్‌రౌండర్. అదే లిస్ట్ ఏ క్రికెట్‌లో 134 మ్యాచుల్లో 2906 పరుగులు చేశాడు. 186 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ రోహిత్ శిష్యుడు క్యాష్ రిచ్ లీగ్‌లో 39 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టాడు.


ఇవీ చదవండి:

స్టార్ హీరోయిన్ పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై భారీ ట్రోలింగ్

టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..

జట్టులో చోటుకు కోహ్లీ అర్హుడు కాదు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2025 | 12:18 PM