SRH vs GT Toss: టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:04 PM

IPL 2025: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరులో టాస్‌ ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకుందే జరిగింది. మరి.. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్‌కు దిగుతున్నారో ఇప్పుడు చూద్దాం..

SRH vs GT Toss: టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
SRH vs GT Toss

చావోరేవో తేల్చుకోక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టాస్ ఓడిపోయింది. అయినా టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే టాస్ గెలిచిన అపోజిషన్ టీమ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి భారీ టార్గెట్ సెట్ చేసి జీటీని ఇరుకున పెట్టే చాన్స్ కమిన్స్ సేనకు ఉంది. కనీసం 200 ప్లస్ స్కోర్ చేసినా గుజరాత్‌ను ప్రెజర్‌లోకి నెట్టొచ్చు. అయితే అందుకు ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా రాణించాల్సి ఉంటుంది. బ్యాటర్లు భారీ లక్ష్యం మీద ఫోకస్ చేయాలి. అదే బౌలర్లు ఆరంభంలో బిగ్ బ్రేక్‌త్రూలు అందించేందుకు ప్రయత్నించాలి. ఒక్కో ఓవర్‌‌ను టార్గెట్‌గా చేసుకొని ముందుకెళ్తే కమిన్స్ సేనకు తిరుగుండదు. బలమైన స్క్వాడ్ కలిగిన సన్‌రైజర్స్‌ అనుకున్న ప్లాన్స్‌ను అనుకున్నట్లు అమల్లో పెడితే విజయం ఖాయం.


ఇవీ చదవండి:

నేను ఆడాలా, వద్దా డిసైడ్ చేసేది అదే: ధోనీ

ఎస్‌ఆర్‌హెచ్‌ లెక్కలు తేల్చాల్సిందే

ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్ జీటీ.. లెక్కలు తేలుస్తారా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 07:10 PM