Suryakumar Yadav: కోహ్లీని భయపెడుతున్న సూర్య.. అనుకున్నదే అవుతోంది
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:13 PM
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని భయపెడుతున్నాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. కింగ్‌ను ఆలోచనల్లో పడేస్తున్నాడు సూర్య. ఇది చూసిన నెటిజన్స్.. అనుకున్నదే అవుతోందిగా అంటున్నారు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. దశాబ్దంన్నరకు పైగా కెరీర్‌లో ఎన్నో పాత రికార్డులకు పాతర వేశాడు కింగ్. కొన్ని ఆల్‌టైమ్ రికార్డులు బ్రేక్ చేసి ఎవరికీ అందని స్థాయికి చేరుకున్నాడు. బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తూ మోడర్న్ గ్రేట్‌గా అందరి మెప్పు పొందుతున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు కట్టబెట్టాడు కోహ్లీ. మూడు ఫార్మాట్లలోనూ దూకుడైన సారథ్యంతో జట్టును గెలుపుబాటలో నడిపిస్తూ పలు రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడో విరాట్ రికార్డు ప్రమాదంలో పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
కింగ్‌కు స్కై సవాల్!
టీ20 క్రికెట్‌లో టీమిండియాకు అత్యుత్తమ సారథిగా ఉన్నాడు రోహిత్ శర్మ. అతడి నాయకత్వంలో ఆడిన 62 మ్యాచుల్లో 50 విజయాలు నమోదు చేసింది భారత్. పొట్టి ఫార్మాట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియా కెప్టెన్స్‌లో హిట్‌మ్యాన్ తర్వాత స్థానంలో లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. అతడి హయాంలో ఆడిన 72 మ్యాచుల్లో 42 గెలుపులు నమోదు చేసింది మెన్ ఇన్ బ్లూ. ఈ లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు కింగ్ కోహ్లీ. అతడి నేతృత్వంలో 50 మ్యాచుల్లో 32 విజయాలు సాధించింది భారత్. ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ అతడ్ని భయపెడుతున్నాడు.
రోహిత్‌నూ దాటేస్తాడా?
టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత భారత టీ20 జట్టు సారథ్య పగ్గాలు చేపట్టాడు సూర్య. అంతకుముందు కూడా పలు మ్యాచుల్లో టీమ్‌ను ముందుండి నడిపించాడు. అయితే పొట్టి ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి మిస్టర్ 360 పూర్తిస్థాయి సారథిగా మారాడు. అతడి సారథ్యంలో ఇప్పటివరకు ఆడిన 18 మ్యాచుల్లో ఏకంగా 15 మ్యాచుల్లో విజయఢంకా మోగించింది టీమిండియా. యువ ఆటగాళ్లను దూకుడైన సారథ్యంతో నడిపిస్తున్నాడు సూర్య. అతడు ఇలాగే టీమ్‌ను నడిపిస్తూ పోతే మరో ఏడాదిలో కోహ్లీ (32 గెలుపులు) రికార్డు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకో రెండేళ్ల పాటు నిలకడగా విజయాలు సాధిస్తే రోహిత్‌ను కూడా సూర్య భాయ్ అధిగమించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. దేవుడే కాపాడాలి
కోహ్లీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి