ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: టీమిండియాకు కొత్త కోహ్లీ.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది

ABN, Publish Date - Jan 26 , 2025 | 03:59 PM

IND vs ENG: భారత జట్టుకు కొత్త కోహ్లీ వచ్చేశాడు. అచ్చం కింగ్‌లాగే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ వస్తున్న ఆ యువ తరంగం భవిష్యత్ మనదే అనే భరోసా ఇస్తున్నాడు.

Team India

విరాట్ కోహ్లీ వారసుడు వచ్చేశాడు. టీమిండియాకు మరో కోహ్లీ దొరికాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ తర్వాత నెక్స్ట్ కోహ్లీ అతడే అని చాలా మంది అభిమానులు ముక్తకంఠంతో అంటున్నారు. అచ్చం విరాట్‌ లాంటి బ్యాటింగ్ స్టైల్, మ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు క్రీజు నుంచి కదలకపోవడం, ప్రత్యర్థులు భీకర బౌలింగ్‌తో భయపెడుతున్నా పట్టుదలతో బ్యాటింగ్ చేయడం, సహచరుల సపోర్ట్‌తో మ్యాచ్ ఫినిష్ చేయడం, సింగిల్స్-డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపిస్తూనే కుదిరినప్పుడు అటాకింగ్‌కు దిగి అపోజిషన్‌ను వణికించడం అంతా కోహ్లీని గుర్తుచేస్తున్నాయి. మరి.. ఆడియెన్స్ మెచ్చుకుంటున్న ఆ నెక్స్ట్ విరాట్? ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..


స్తంభంలా పాతుకుపోయాడు!

తిలక్ వర్మ తదుపరి కోహ్లీ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్‌ది కూడా ఇదే మాట. దీనికి కారణం ఇంగ్లండ్‌పై అతడు ఆడిన మార్వలెస్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. చెపాక్ టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ బ్యాటర్.. ఆఖరి పరుగు వరకు అక్కడే పాతుకుపోయాడు. మ్యాచ్‌ను ముగించి గానీ అక్కడి నుంచి కదల్లేదు. అటాకింగ్ బ్యాటర్ అయిన తిలక్.. నిన్న మాత్రం మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. 4 బౌండరీలు బాదిన అతడు.. 5 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడ్డాడు.


అచ్చం కోహ్లీలాగే..

ఓపెనర్లు ఇద్దరూ 20 పరుగుల్లోపే ఔటైనా, కెప్టెన్ సూర్య, హార్దిక్ సహా కీలక బ్యాటర్లు అంతా పెవిలియన్‌కు చేరుకున్నా తిలక్ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేశాడు. టీమ్‌ను తాను గెలుపు తీరాలకు చేరుస్తానని నమ్మి అదే చేసి చూపించాడు. తన బలాన్ని నమ్ముకుంటూనే.. ఇతర బ్యాటర్ల నుంచి ఎంత సాయం అవసరమో అంతా రాబట్టాడు. యాంకర్ ఇన్నింగ్స్‌ ఆడుతూ ఒక ఎండ్‌ను కాపాడాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్లను ఎలా ఆడాలో చెప్పి ఫలితం రాబట్టాడు. అతడి మెచ్యూరిటీ, టెక్నిక్, స్కిల్ లెవల్, గేమ్ అవేర్‌నెస్, ఆలోచనా తీరు.. ఇవన్నీ చూసిన ఎక్స్‌పర్ట్స్ నెక్స్ట్ కోహ్లీ అని మెచ్చుకుంటున్నారు. అయితే విరాట్‌లా ఎదగాలంటే నిలకడగా ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాలని సూచిస్తున్నారు.


ఇదీ చదవండి:

రోహిత్-కోహ్లీ వల్లే కాలేదు.. తిలక్ వర్మ సాధించి చూపించాడు

తిలక్‌ను పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

టీ20 ఉత్తమ క్రికెటర్‌గా అర్ష్‌దీప్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 03:59 PM