Rishabh Pant: పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్.. మళ్లీ హింట్ ఇచ్చిందిగా..

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:20 PM

Today IPL Match: ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో లక్నో సూపర్ జియాంట్స్ జట్టు పడుతూ లేస్తూ పోతోంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ రాకపోయినా ఆ టీమ్ బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఈ తరుణంలో లక్నోకు మంచి బూస్టప్ ఇచ్చిందో హీరోయిన్.

Rishabh Pant: పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్.. మళ్లీ హింట్ ఇచ్చిందిగా..
Rishabh Pant

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్‌లో లక్నో టీమ్ పడుతూ లేస్తూ ప్రయాణిస్తోంది. ఒక మ్యాచ్‌లో గెలుపు, ఇంకో దాంట్లో ఓటమి అనేలా ఆ టీమ్ సిచ్యువేషన్ ఉంది. పంత్ కెప్టెన్‌గా తనకు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్‌ను వాడుకొని మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అయితే బ్యాటర్‌గా అతడు ఫెయిల్ అవడం టీమ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. దీంతో అతడు దానిపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ తరుణంలో పంత్‌కు బూస్టప్ ఇచ్చేలా కామెంట్ చేసిందో హీరోయిన్. అతడి టీమ్‌కు సపోర్ట్ చేస్తూనే.. పనిలో పనిగా పించ్ హిట్టర్ మీద ప్రేమనూ చూపించింది. ఎవరామె అనేది ఇప్పుడు చూద్దాం..


మర్చిపోలేక..

పంత్ టీమ్‌ అంటే తనకు ఇష్టమని స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా కామెంట్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ జట్టయిన ఆర్సీబీతో పాటు లక్నో సూపర్ జియాంట్స్‌కు ఈసారి తాను మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే ఆర్సీబీ గురించి చెప్పినందుకు లైట్ తీసుకున్నా.. లక్నో పేరు చెప్పడంతో ఊర్వశీ-పంత్ ప్రేమాయణం మరోమారు బయటపడిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడ్ని హీరోయిన్ మర్చిపోలేకపోతోందని కామెంట్స్ చేస్తున్నారు.


హింట్ అదిరింది

పంత్ ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌కు ఊర్వశీ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు నెటిజన్స్. అప్పట్లో రిషబ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్నప్పుడు ఆ జట్టుకే తన మద్దతు అని చెప్పిందని.. ఇప్పుడు ఎల్‌ఎస్‌జీ అని మాట మార్చేసిందని చెబుతున్నారు. దీన్ని బట్టే పంత్‌ను ఆమె ఎంతగా ఇష్టపడుతోందో అర్థం చేసుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. పంత్ పేరు నేరుగా చెప్పకపోయినా.. మనసు చంపుకోలేక ఇన్‌డైరెక్ట్‌గా తమ రిలేషన్ గురించి ఇలా హింట్ ఇచ్చిందని అంటున్నారు. కాగా, పంత్-ఊర్వశీ లవ్‌లో ఉన్నారని గత కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 2018లో వీళ్లు డిన్నర్‌కు వెళ్లారని, అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.


మరో అమ్మాయితో..

మిస్టర్ ఆర్పీ.. అంటూ అతడ్ని ఉద్దేశించి ఊర్వశీ అప్పట్లో చేసిన పోస్టులు దీనికి మరింత ఊతం ఇచ్చాయి. అయితే వాళ్లు నిజంగానే రిలేషన్‌లో ఉన్నారా.. లేదా.. అనేది క్లారిటీ లేదు. కాగా, ఇషా నేగి అనే మరో అమ్మాయితో పంత్ ప్రేమలో ఉన్నాడంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి. అయితే ఇద్దరిలో ఎవరూ దాని మీద రియాక్ట్ అవలేదు. ఈ తరుణంలో మరోమారు పంత్ టీమ్‌కు ఊర్వశీ సపోర్ట్ చేయడంతో వాళ్ల ప్రేమను ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇదే ఇంటర్వ్యూలో పంత్‌తో యాడ్ చేసే చాన్స్ వస్తే ఎస్ చెబుతారా అని ఊర్వశికి క్వశ్చన్ ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. స్క్రిప్ట్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.


ఇవీ చదవండి:

ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి హెచ్‌సీఏ కారణమా..

సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ చాన్స్ ఉందా..

రిటైర్మెంట్‌.. ఇప్పుడే కాదు..!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2025 | 12:24 PM