Share News

IPL 2025: రిటైర్మెంట్ ముచ్చటే లేదు.. అప్పటిదాకా ఆడుతూనే ఉండాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:16 PM

Kohli-Rohit: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కాంమెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..

IPL 2025: రిటైర్మెంట్ ముచ్చటే లేదు.. అప్పటిదాకా ఆడుతూనే ఉండాలి
Virat Kohli-Rohit Sharma

క్రికెటర్ల రిటైర్మెంట్‌పై ఎప్పుడూ ఏవో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు ఎప్పటివరకు ఆడతారనే దానిపై తరచూ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సారథి రోహిత్ శర్మ కెరీర్‌పై కూడా ఇలాంటి చర్చలు చాన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరూ టీ20లకు గుడ్‌బై చెప్పేశారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగుతున్నారు. అయినా రిటైర్మెంట్ రూమర్స్ తగ్గడం లేదు. దీనిపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ స్పందించాడు. అప్పటివరకు వాళ్లు ఆడుతూనే ఉంటారన్నాడు.


అప్పటివరకు ఆగొద్దు

కోహ్లీ-రోహిత్‌‌లో మరింత క్రికెట్ మిగిలి ఉందన్నాడు గేల్. వాళ్ల ఏజ్ కూడా తక్కువేనన్నాడు. రిటైర్మెంట్ తీసుకోమంటూ వాళ్లపై ఒత్తిడి పెంచడం సరికాదన్నాడు వెస్టిండీస్ గ్రేట్. ఇలాంటి గొప్ప ఆటగాళ్లు గేమ్‌లో కొనసాగడం చాలా అవసరమని స్పష్టం చేశాడు గిల్. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఇలాంటి ప్లేయర్లు అందించే సేవలు ఎంతో ముఖ్యమని తెలిపాడు. వాళ్ల తర్వాత కూడా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే ఆటగాళ్లు వస్తారని.. కానీ సాధ్యమైనంత ఎక్కువ కాలం కోహ్లీ-రోహిత్ ఆడుతూనే ఉండాలని కోరాడు.


ఆ నాక్‌కు మతిపోయింది

గతంలో ఆర్సీబీకి ఆడిన గేల్.. ఈ ఐపీఎల్ సీజన్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ ఎడిషన్‌లో బెంగళూరు జట్టుగా నిలకడగా ఆడటం, వరుస విజయాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను వాళ్ల సొంతగడ్డ మీద ఓడించడం సూపర్ అన్నాడు గేల్. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ ఆర్సీబీని అద్భుతంగా నడిపిస్తున్నాడని, అతడు ఇదే రీతిలో జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు విండీస్ లెజెండ్. 141 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్‌ శర్మనూ ప్రశంసల్లో ముంచెత్తాడు గేల్. అతడి నాక్ మైండ్‌బ్లోయింగ్ అని మెచ్చుకున్నాడు.


ఇవీ చదవండి:

నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్

రోహిత్ మాటతో రిజల్ట్ తారుమారు

యూపీఐకి ఐపీఎల్ బెట్టింగ్ ఫీవర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2025 | 03:18 PM