Virat Kohli: కెప్టెన్‌గా కోహ్లి.. ఒక్క మాటతో తేల్చేసిన హెడ్ కోచ్
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:13 PM
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి చాన్నాళ్లు కావొస్తోంది. అటు భారత జట్టుతో పాటు ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ పోస్ట్‌కూ అతడు దూరంగా ఉంటున్నాడు. తన ఆటేదో తాను ఆడుకోవడం అన్నట్లు ఉంటున్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి చాన్నాళ్లు కావొస్తోంది. అటు భారత జట్టుతో పాటు ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ పోస్ట్‌కూ అతడు దూరంగా ఉంటున్నాడు. తన ఆటేదో తాను ఆడుకోవడం అన్నట్లు ఉంటున్నాడు. అలాగని బాధ్యతలను విస్మరించడం లేదు. సీనియర్ ఆటగాడిగా తన రెస్పాన్సిబిలిటీస్ తాను నిర్వర్తిస్తున్నాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు ఎప్పటికప్పుడు సరైన సజెషన్స్, గైడెన్స్ ఇస్తూ అండగా ఉంటున్నాడు. రీసెంట్‌గా సిడ్నీ టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలగడంతో కెప్టెన్సీ చేపట్టి టీమ్‌ను నడిపించాడు. అయితే పూర్తి స్థాయి సారథిగా విరాట్‌ను చూసి చాలా కాలం అవుతోంది. త్వరలో ఇది నిజం కానుందని తెలుస్తోంది.
చార్జ్ తీసుకుంటాడా?
భారత టెస్ట్ జట్టుకు కోహ్లీని కెప్టెన్ చేస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫెయిల్యూర్, టీమ్ వరుస ఓటములతో ఆ పోస్ట్‌ను కోహ్లీకి అప్పగిస్తారని వినిపిస్తోంది. అదే తరుణంలో అటు ఐపీఎల్‌లో ఆర్సీబీకి సారథిగా విరాట్‌ను నియమిస్తారనే పుకార్లు కూడా జోరందుకున్నాయి. టీమ్‌కు కెప్టెన్ లేకపోవడంతో సీనియర్ అయిన కోహ్లీకే ఆ బాధ్యతలు ఇస్తారని సమాచారం. అటు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇటు ఫ్రాంచైజీ క్రికెట్‌లో సారథిగా ఒకేమారు కింగ్ పేరు వినిపిస్తున్న తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించాడు. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ టీమ్‌ను కోహ్లీ నడుపుతాడా? లేదా? అనేది తేల్చేశాడు. ఆండీ ఫ్లవర్ ఏమన్నాడంటే..
తొందర ఎందుకు?
‘కెప్టెన్సీపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. దానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. ఆర్సీబీ టీమ్ ఇప్పుడు కొత్త శకంలోకి అడుగు పెడుతోంది. వచ్చే మూడేళ్ల పాటు జట్టును సమర్థంగా నడపడం చాలా అవసరం. ఈ త్రీ ఇయర్ సైకిల్‌లో బెంగళూరు అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటాం’ అని ఆండీ ఫ్లవర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ఎంపిక గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్న ఆర్సీబీ హెడ్ కోచ్.. దీనిపై ఇంకా పూర్తిస్థాయి చర్చలు జరగలేదని స్పష్టం చేశాడు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. కాగా, 2013లో బెంగళూరు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ.. 2016లో టీమ్‌ను రన్నరప్‌గా నిలిపాడు. 2021లో కెప్టెన్సీ నుంచి అతడు తప్పుకున్నాడు. అప్పటి నుంచి ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటోడు మళ్లీ సారథి అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్సీ రేసులో కోహ్లీ ఉన్నాడా? అనే అంశాన్ని ఆండీ ఫ్లవర్ ఖండించలేదు. కాబట్టి అతడే తదుపరి సారథి అని.. విరాట్ ఏం చెబితే అదే శాసనం అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
జర్రుంటే సచ్చిపోతుండే.. డేవిడ్ భాయ్ అదృష్టం బాగుంది
స్వామీజీ ఆశీస్సులు.. కోహ్లీకి ఇక తిరుగులేదు
రేడియో జాకీతో చాహల్ డేటింగ్ ?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 11 , 2025 | 12:20 PM