KL Rahul: కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న రాహుల్.. తెలిసే చేస్తున్నాడా..
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:25 PM
Delhi Capitals: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొత్త సీజన్‌లో అదరగొట్టాలని చూస్తున్నాడు.
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఇప్పుడు నయా టార్గెట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో దుమ్మురేపిన ఈ స్టైలిష్ బ్యాటర్.. త్వరలో మొదలయ్యే ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాలని చూస్తున్నాడు. లక్నో సూపర్ జియాంట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిన రాహుల్.. డీసీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాడు. మంచి స్కోర్లు బాదుతూ ఆ టీమ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. అయితే అతడు చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
కావాలనే వదులుకున్నాడా..
ఐపీఎల్-2025కు ముందు నిర్వహించిన మెగా ఆక్షన్‌లో రాహుల్‌ను రూ.14 కోట్ల ధర చెల్లించి సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంతకుముందు సారథిగా ఉన్న రిషబ్ పంత్‌ను వదిలేసి రాహుల్‌ను తెచ్చుకుంది డీసీ. దీంతో కొత్త సీజన్‌లో అతడే కెప్టెన్‌గా ఢిల్లీని ముందుండి నడిపిస్తాడని అంతా అనుకున్నారు. కెప్టెన్సీ ఎక్స్‌పీరియెన్స్ ఉంది కాబట్టి అతడ్ని సారథిగా నియమించడం పక్కా అని భావించారు. కానీ అనూహ్యంగా అక్షర్ పటేల్‌ను కెప్టెన్ చేసింది డీసీ. దీంతో అంతా షాక్ అయ్యారు. దీని వెనుక అసలు నిజం తెలిసి మరింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాహుల్ కెప్టెన్సీ వద్దనుకోవడంతోనే అక్షర్‌కు ఆ చాన్స్ దక్కిందని వినిపిస్తోంది.
ఎందుకిలా చేస్తున్నాడు..
రాహుల్‌కు కెప్టెన్సీ కొత్త కాదు. 2 సీజన్లు పంజాబ్ కింగ్స్‌కు, మరో రెండు సీజన్లు లక్నోకు సారథిగా వ్యవహరించాడతను. ఈ అనుభవం వల్లే కొన్ని సిరీస్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని అతడు దక్కించుకున్నాడు. కానీ ఇప్పుడు డీసీ సారథ్యానికి అతడు కావాలనే దూరంగా ఉండటం తప్పుడు సంకేతాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, చాంపియన్స్ ట్రోఫీలో రాణించడం ద్వారా వన్డే, టెస్ట్ టీమ్‌లో కేఎల్ పర్మినెంట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లేనని అంటున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కెప్టెన్సీ చాన్సుల్ని కొట్టిపారేయలేం. కానీ తాజా నిర్ణయంతో తనకు సారథ్యం మీద మోజు, ఆసక్తి లేదని అతడు చెప్పకనే చెప్పినట్లయింది. దీని వల్ల ఐపీఎల్‌లోనే కాదు.. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే సమయంలోనూ అతడ్ని కేవలం బ్యాటర్, కీపర్‌గానే కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే కెప్టెన్సీని వదలుకొని అతడు కెరీర్ నాశనం చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
గ్రౌండ్‌లో బూతులు.. రోహిత్ కావాలనే తిడతాడా..
వరుణ్‌కు చంపేస్తామని బెదిరింపులు
ముంబై తొలిపోరుకు హార్దిక్ దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2025 | 12:42 PM