Share News

IPL 2025, DC vs CSK: చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి.. కొనసాగుతున్న ఢిల్లీ జైత్రయాత్ర

ABN , Publish Date - Apr 05 , 2025 | 07:32 PM

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. చెన్నైలో స్వంత స్టేడియం కూడా చెన్నై రాతను మార్చలేకపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై హ్యాట్రిక్ అపజయాలను మూటగట్టుకుంది.

IPL 2025, DC vs CSK: చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి.. కొనసాగుతున్న ఢిల్లీ జైత్రయాత్ర
DC Won by 25 runs against CSK

ఐపీఎల్‌ (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. చెన్నైలో స్వంత స్టేడియం కూడా చెన్నై రాతను మార్చలేకపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై హ్యాట్రిక్ అపజయాలను మూటగట్టుకుంది (CSK vs DC). చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఓటమి అనేది లేకుండా వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ (77) హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (33), స్టబ్స్ (24) వేగంగా పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. జడేజా, మహిష్ పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. మ్యాచ్ ఆసాంతం ఢిల్లీ హవా కొనసాగింది.


చెన్నై బ్యాటర్లలో విజయ్ శంకర్ (69 నాటైట్) చివరి వరకు పోరాడాడు. అయితే ధోనీ (30 నాటౌట్) తప్ప మిగిలిన వారు విఫలం కావడంతో చెన్నై ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి..

Rishabh Pant-Sanjeev Goenka: మళ్లీ విఫలమైన పంత్.. లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూడండి


IPL 2025: తీరు మార్చుకోని దిగ్వేష్.. బీసీసీఐ భారీ జరిమానా.. పంత్‌కు కూడా ఫైన్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 07:32 PM