బిల్లుకు దారేది!
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:00 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల బిల్లుల బాకీలు భారీగా పేరుకు పోయాయి. పూడ్చిన గుంతలు, ఇతర మరమ్మ తులకు బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులకు సంబంధించి గుంతలు పూడ్చాలని సీఎం చంద్ర బాబు ఆదేశించడంతో సంక్రాంతి వరకు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఈ పనులన్నీ పూర్తిచేశారు.

గత పనులతో మనకేం సంబంధం
బిల్లు.. చెల్లింపు నిల్
ఉమ్మడి జిల్లాలో రూ.400 కోట్లు
భారీగా ఆర్‌అండ్‌బీ బకాయిలు
అమలాపురం రూ.150 కోట్లు
రాజమండ్రి డివిజన్ రూ.30 కోట్లు
ప్రభుత్వ బాకీలు రూ.90 కోట్లే
అత్యధిక బాకీలు వైసీపీలోనివే
ఇటీవల రూ.290 కోట్లు చెల్లింపు
పాత బాకీలు ఆపండి
ప్రభుత్వం తాజా నిర్ణయం
కాంట్రాక్టర్ల గగ్గోలు
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల బిల్లుల బాకీలు భారీగా పేరుకు పోయాయి. పూడ్చిన గుంతలు, ఇతర మరమ్మ తులకు బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులకు సంబంధించి గుంతలు పూడ్చాలని సీఎం చంద్ర బాబు ఆదేశించడంతో సంక్రాంతి వరకు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఈ పనులన్నీ పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలో రహదారుల బిల్లుల బాకీలు రూ.400కోట్లకుపైగానే పేరుకుపోయాయి. ఇందు లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గుంతలు పూడ్చిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.90 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో హడావుడిగా రహదా రుల మురమ్మతులు చేపట్టారు. కానీ బిల్లులను మాత్రం జగన్ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారేసమయానికి ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ బాకీలు రూ.600కోట్ల వరకు ఉన్నాయి. అయితే కాంట్రాక్టర్ల ఆవేదన విన్న సీఎం చంద్రబాబు పాతబాకీల్లో రూ.290 కోట్లు వరకు విడుదలయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. ఇవిపోను తాజా పనులతో కలిపి మొత్తం బాకీలు రూ.400 కోట్ల వరకు ఉన్నాయి. అయితే నిధుల కొరతతో గతేడాది వరకు పేరు కుపోయిన బిల్లుల బాకీలు ఇకపై చెల్లించ కూడదని సర్కారు తాజాగా నిర్ణయం తీసు కోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.
అప్పుడలా వదిలేశారు...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం మారడంతో కొంత ఒడ్డు నపడ్డామని భావిస్తోన్న కాంట్రాక్టర్లు సర్కారు తాజా నిర్ణయంతో తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికక్కడ రహ దారులను గాలికొదిలేశారు. ప్రజలు,పార్టీలు ఆం దోళనలు చేసినా అప్పట్లో జగన్ సర్కారు చెవి కెక్కించుకోలేదు. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్ని కలు జరగడంతో ఓట్ల కోసం అప్పటిక ప్పుడు వైసీపీ ప్రభుత్వం కొన్ని కీలక రహదా రులకు మరమ్మతులు చేపట్టింది. టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఎన్నికల ఏడాది కావ డంతో చేసిన పనులకు బిల్లులు వస్తాయనే ఆశతో చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేశారు. తీరా జగన్ ప్రభుత్వం బాకీలు చెల్లించకుండా చేతులెత్తేసింది.ఈలోపు ఎన్నికలు రావడంతో వైసీపీ ఓడిపోయింది. దీంతో కాం ట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పట్లో చేసిన పనులకు సంబంధించి రూ.600 కోట్ల వరకు బిల్లులు పేరుకుపోయాయి. ఈ లోపు ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్లు అధి కారుల చుట్టూ తిరిగారు. విషయం సీఎం చంద్రబాబుకు వివరించారు. కాంట్రాక్టర్ల పరి స్థితిని అర్థం చేసుకున్న సీఎం బాకీల్లో కొంత విడుదలకు అధికారులను ఆదేశించారు. దీంతో గతేడాది చివర్లో మొత్తం రూ.600 కోట్ల బాకీ లకు గాను రూ.290 కోట్లను ప్రభుత్వం చెల్లిం చింది. దీంతో కొంత వరకు కాంట్రాక్టర్లు ఒడ్డున పడ్డారు.ప్రభుత్వం మారిన తర్వాత రహదారుల దుస్థితిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అనేక రహదారుల పరిస్థితి దయనీయంగా ఉండడం గుర్తించారు. ఎక్కడెక్కడ ఏయే రహదారులకు మరమ్మతులు, గుంతలు పూడ్చాలో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా లో గుర్తించిన రహదారుల గుంతలు పూడ్చే పనులు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చేపట్టారు. ఇందుకు రూ.150 కోట్ల వరకు ఖర్చయింది. అయితే వీటికి చెల్లింపులు చేయగా ఇంకా రూ.90 కోట్ల వరకు బాకీలు పేరుకుపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవ డంతో బిల్లుల చెల్లింపు కష్టంగా మారింది. ఉన్న ంతవరకు ప్రభుత్వం అతికష్టంపై ఒక్కో బిల్లు చెల్లించుకువస్తున్నా ఆర్‌అండ్ బాకీలు క దలక పోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.
అత్యధికం అక్కడే..
మొత్తం పేరుకుపోయిన రూ.400 కోట్ల బాకీల్లో కాకినాడ ఆర్‌అండ్‌బీ డివిజన్‌కు సం బంధించి రూ.40 కోట్ల వరకు బిల్లులు పేరుకు పోయాయి. పెద్దాపురం ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో రూ.35 కోట్లు, డాక్టర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా(అమలాపురం డివిజన్)లో రూ.150 కోట్లు, రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో రూ.30 కోట్లు బకాయిలు పేరుకుపో యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ. 20 కోట్లు, రాజానగరం-సామర్లకోట ఏడీబీ రో డ్డుకు సంబంధించి రూ.30 కోట్లు బకాయిలు ఉన్నాయు. అయితే ఇందులో సింహభాగం గత ప్రభుత్వ హయాంలోవే. మరోపక్క చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో అధ్వా న రహదారులపై చలించిపోయారు. యుద్ధ ప్రాతిపదికన వీటిని గుర్తించి గుంతలు పూడ్చే లా ఆదేశాలు జారీచేశారు. ఇందుకు రూ.150 కోట్లకు పైగానే ఖర్చయింది. వీటికి సంబంధించి కొంత చెల్లింపులు చేయగా ఇంకా ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో రూ.90 కోట్ల వరకు బిల్లు లు నిలిచిపోయాయి. అమలాపురం సర్కిల్ పరి ధిలో రూ.38 కోట్లు, పెద్దాపురం రూ.12 కోట్లు, రాజమహేంద్రవరం రూ.16 కోట్లు, కాకినాడ ఆర్‌అండ్‌బీ డివిజన్‌లో రూ.24 కోట్లు బకాయి లు ఉన్నాయి. ఇదిలాఉంటే సకాలంలో బిల్లులు రాకపోవడం ప్రస్తుతం కొత్తగా టెండర్లు పిలవ డానికి సిద్ధంగా ఉన్న కొన్ని రహదారుల నిర్మా ణంపై ప్రభావం చూపుతోంది. కొత్త పనులకు అధికారులు అంచనాలు సిద్ధం చేయగా, టెం డర్లు పిలవడానికి పాలనాపరమైన ఆమోదం కూడా లభించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిని పిలిస్తే కాంట్రాక్టర్లు ఆసక్తి చూపరని అధికారులు భావిస్తున్నారు. దీంతో కొత్త ప్రా జెక్ట్‌లు ముందుకు కదలడంలేదు. ఇదిలా ఉంటే కొత్తగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.64 కో ట్లు నిధులు మంజూరు చేస్తూ పాలనాపర మైన ఆమోదం ఇచ్చింది. వీటికి త్వరలో టెండ ర్లు పిలవబోతున్నారు. అయితే గతంలో నిలిచి పోయిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు ఒత్తి డి చేస్తుండడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువె ళ్తామని అధికారులు చెబుతున్నారు. మరోపక్క గతేడాది వరకు నిలిచిపోయిన పెండింగ్ బిల్లు లకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌లో లోడ్ చేసిన బిల్లులను సైతం వెనక్కు తీసుకుని చెల్లింపులు నిలిపివేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయిం చింది. దీంతో బాకీల పరిస్థితి ఏంటోనని అధికా రులు, కాంట్రాక్టర్లు తలపట్టుకుంటున్నారు.