IPL Disciplinary Action: ఇషాంత్‌కు జరిమానా

ABN, Publish Date - Apr 08 , 2025 | 04:38 AM

గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మపై మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ నిబంధనలను అతిక్రమించినట్లు తేలింది

IPL Disciplinary Action: ఇషాంత్‌కు జరిమానా

హైదరాబాద్‌: గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంతేకాకుండా ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా అతడి ఖాతాలో చేరింది. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ 2.2 రూల్‌ను అతిక్రమించినట్టు తేలింది. క్రికెట్‌ సామగ్రి, జెర్సీ, మైదానంలోని వస్తువులను అగౌరవపర్చడం దీనికిందికి వస్తుంది. రెఫరీ శ్రీనాథ్‌ విధించిన ఈ జరిమానాను ఇషాంత్‌ అంగీకరించాడు.



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 04:40 AM